Prabhu yesu prabhu yesu
adigo shramanondenu
khaideelanu vidipinchenu siluvalo
1. Entha krooramo – shatrukaaryamu
Choodumaa – anthagaa baadhinchi
siluva meeda keththiri – baadhanondiyu
eduru maata laadaka “Khaideela”
2. Mundla makutamu – thana thala nunchiri
moorkhula debbala baadhanu sahinchenu
moosi yundina moksha dwaaramu therachi “Khaideela”
3. Aatma devudu – pratyakshambaaye siluvalo
sooryu dadrushudai kammenantha cheekati
saarvathrikamu – gada gada vanakenu “Khaideela”
4. Maraninchenu – samaadhi nuncha badenu
moodava naadu samaadhi nundi lechenu
vidipinchenu marana bandhitulanu “Khaideela”
5. Theesi vesenu naa paapa neramanthayu
devayani prabhu arachina yapudu
devuni daya – kumarincha badenu “Khaideela”
6. Kaaru cheekatilo dukkhambulo nenuntini
neeku verugaa naarakshanila ledugaa
naadu shramalu verevvaru nerugaru “Khaideela”
ప్రభుయేసు ప్రభుయేసు అదిగో శ్రమ నొందెను
ఖైదీలను విడిపించెను సిలువలో
1. ఎంత కౄరమో – శత్రు కార్యము చూడుమా
అంతగా బాధించి సిలువమీద కెత్తిరి
బాధనొందియు – ఎదురు మాటలాడక
|| ప్రభుయేసు ||
2. ముండ్ల మకుటము – తన తల నుంచిరి
మూర్ఖుల దెబ్బల బాధను సహించెను
మూసియుండిన మోక్షద్వారము తెరచి
|| ప్రభుయేసు ||
3. ఆత్మదేవుడు – ప్రత్యక్షంబాయె సిలువలో
సూర్యుడదృశ్యుడై క్రమ్మెనంత చీకటి
సార్వత్రికము – గడగడ వణికెను
|| ప్రభుయేసు ||
4.మరణించెను – సమాధి నుంచబడెను
మూడవనాడు సమాధినుండి లేచెను
విడిపించెను మరణ బంధితులను
|| ప్రభుయేసు ||
5. తీసివేసెను – నా పాప నేరమంతయు
దేవయని ప్రభు అరచిన యపుడు
దేవునిదయ – కుమ్మరించబడెను
|| ప్రభుయేసు ||
6. కారు చీకటిలో దుఃఖంబులో నేనుంటిని
నీకువేరుగా నారక్షణిల లేదుగా
నాదు శ్రమలు వేరెవ్వరు నెరుగరు
|| ప్రభుయేసు ||