Raajula raaju – prabhuvula prabhoo
ee jagatiki – arudenche prabhoo
1. Prabhaavampu dootala thoda – prabhu vetenchun
agni jwaalalo aa dinamuna pavitra janamuna
mahimaascharya karudagu prabhu “Raajula”
2. Prabhu yesu thaane swargamu nundi -arbhaatamutho
piluchuchu vachun prabhu jeevitulanu mruthulaina
vaarini – devuni prajalanu thana chenthan jerchun “Raajula”
3. Dhanyulu prabhukai joochedi vaaru – minnuna prabhutho
kalisi velledaru – viswasulanu prematho prabhuvu –
aahwaaninchunu thana sannidiki “Raajula”
4. Anantha jeevamu nee kitchunu – ghanatha mahima prabhu
neekitchun – thandritho ninnu jerchunu prabhuvu –
jeeva kireetamu neekitchunu “Raajula”
రాజులరాజు – ప్రభువుల ప్రభూ
ఈ జగతికి – అరుదెంచె ప్రభూ
1. ప్రభావంపు దూతలతోడ – ప్రభువేతెంచున్ అగ్ని జ్వాలలలో
ఆ దినమున పవిత్ర జనమున – మహిమాశ్చర్యకరుడగు ప్రభు
|| రాజులరాజు ||
2. ప్రభు యేసు తానే స్వర్గమునుండి – ఆర్భాటముతో పిలుచుచు వచ్చున్
ప్రభు జీవితులను మృతులైన వారిని – దేవుని ప్రజలను తనచెంతన్ జేర్చున్
|| రాజులరాజు ||
3. ధన్యులు ప్రభుకై జూచెడివారు – మిన్నున ప్రభుతో కలసి వెళ్ళెదరు
విశ్వాసులను ప్రేమతో ప్రభువు – ఆహ్వానించును తన సన్నిధికి
|| రాజులరాజు ||
4. అనంత జీవము నీకిచ్చును – ఘనత మహిమ ప్రభు నీకిచ్చున్
తండ్రితో నిన్ను జేర్చును ప్రభువు – జీవ కిరీటము నీకిచ్చును
|| రాజులరాజు ||