Rajula rajuga Yesu prabhundu
rayamuna ranai yunnadu
1. Rakshanaalankaaramutho – thakshaname siddapadudi
akshayudagu na rakshakuni – nireekshanatho vedandi “Raju”
2. Mana prabhu yesuni raktamu – mana paapamulanu pogtti
mana prabhu raakada manakentho –
mahimaanandamu kalginchun “Raju”
3. Modata gorepilla vale – nodigi vachenu mana prabhuvu
kodamasimhamuga vachunu – gunde digulu papiki“Raju”
4. Gurutulanniyu jaruguchunda – sariga chudumu viswasi
twarapadumu nee prabhuni jooda -karamulethi prardinchu “Raju”
5. Yellaru kristuni raakanu – ullasamutho koruchu
halleluya paatalu padi – yellappudu stutinchedamu “Raju”
రాజుల రాజుగ యేసు ప్రభుండు
రయమున రానై యున్నాడు
1. రక్షణాలంకారముతో – తక్షణమే సిద్ధపడుడి
అక్షయుడగు నా రక్షకుని – నిరీక్షణతో వేడండి
|| రాజుల ||
2. మన ప్రభు యేసుని రక్తము – మన పాపములను పోగొట్టి
మన ప్రభురాకడ మనకెంతో – మహిమానందము కలిగించున్
|| రాజుల ||
3. మొదట గొఱ్ఱెపిల్ల వలె – నొదిగి వచ్చెను మన ప్రభువు
కొదమసింహముగా వచ్చును – గుండెదిగులు పాపికి
|| రాజుల ||
4. గురుతులన్నియు జరుగుచుండ – సరిగా చూడుము విశ్వాసి
త్వరపడుము నీ ప్రభుని జూడ – కరములెత్తి ప్రార్థించు
|| రాజుల ||
5. ఎల్లరు క్రీస్తుని రాకను – ఉల్లాసముతో కోరుచు
హల్లెలూయా పాటలు పాడి – ఎల్లప్పుడు స్తుతియించెదము
|| రాజుల ||