Randi randi rayamuna Yesuni

Randi randi rayamuna Yesuni –
rakshakuniga nangeekarinchudi

A. P. : Preethito prabhuni cherudi prabhula prabhuve
raajula raajuve raabovu naathade

1. Prayasapadi bharamu moyuvarala –
athi prematho nahvaaninchenu
bharamantha paradrolunu, vishrnatinichunu
vegame rarammu eemaata nikkamu “Randi”

2. Papapu jeetamu nithya narakamu, papi neekika dikkevaru
nitya jeeva miyyavachenu, nee koraku vachchenu
thana praanamichenu, ninnu rakshimpanu “Randi”

3. Mayalokam mosamujesenu –
marana samayamu samipinchenu
thannu cheruvari nevvarin, truneekarinchadu
ninu throsiveyadu ee maata nammu “Randi”

4. Kristu Yesu ninu preminchi nee korakai thane vachen
needu doshamantatikai, rakthamu kaarchenu
shikshanu pondenu, sriyesun cherumu “Randi”

5. Paapularaa parugidirandi paapula mitrudesuni cherudi
shaktito ninnu rakshinchunu santosamichunu
sandehapadaku, suvarthan nammumu “Randi”

6. Needu papamu nantatini neevu nikkamuga noppukonina
ayane tanaraktamuto, kadugu premato
kaapaadu nerputho, karuna sakthitho “Randi”

“దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను” యోహాను John 3:16

పల్లవి : రండి రండి రయమున యేసుని – రక్షకునిగ నంగీకరించుడి

అనుపల్లవి : ప్రీతితో – ప్రభుని చేరుడి ప్రభుల ప్రభువే
రాజుల రాజువే – రాబోవునాతడే

1. ప్రయాసపడి భారము మోయువారల – అతి ప్రేమతో నాహ్వానించెను
భారమంత పార ద్రోలును, విశ్రాంతినిచ్చును
వేగమే రారమ్ము ఈ మాట నిక్కము
|| రండి ||

2. పాపపు జీతము నిత్యనరకము, ఓ పాపి నీకిక దిక్కెవరు
నిత్యజీవ మియ్యవచ్చెను, నీ కొరకువచ్చెను
తన ప్రాణమిచ్చెను, నిన్నురక్షింపను
|| రండి ||

3. మాయలోకం మోసముజేసెను – మరణసమయము సమీపించెను
తన్నుచేరువారి నెవ్వరిన్, తృణీకరించడు
నిను త్రోసివేయడు ఈ మాట నమ్ముము
|| రండి ||

4. క్రీస్తుయేసు నిను ప్రేమించి నీ కొరకై తానే వచ్చెన్
నీదు దోషమంతటికై, రక్తము కార్చెను
శిక్షను పొందెను, శ్రీ యేసున్ చేరుము
|| రండి ||

5. పాపులారా పరుగిడిరండి పాపుల మిత్రుడేసుని చేరుడి
శక్తితో నిన్ను రక్షించును సంతోషమిచ్చును
సందేహపడకు, సువార్తన్ నమ్ముము
|| రండి ||

6. నీదు పాపము నంతటిని నీవు నిక్కముగ నొప్పుకొనిన
ఆయనే తనరక్తముతో, కడుగు ప్రేమతో
కాపాడు నేర్పుతో, కరుణ శక్తితో
|| రండి ||

Leave a Comment