Sanvatsaradi modalu – sanvatsarantamu varaku
ni devudehova – ninu kanupapaga kacenu
nipai kanudrsti nuncenu – sanvatsaradi modalu
1. Naluvadi sanvatsaramulu aranyamulo – ni sancara jivitamunu
erigenu ayane ninnu – asirvadinci – ni cetipanini
ninḍuga divincenu – ninḍaruga divincenu || Sanvatsaradi ||
2. Munupatikante adhikamaina – melulu niku kalugajeya
erigenu ayane ninnu – abhivruddhi paraci – vistruti paraci
vasamuga cesenu – nivasanamuga jesenu || Sanvatsaradi ||
3. Lekkaku mikkuta bangaramunu – ittadi inumu ni kalavani
erigenu ayane ninnu – mandira paniki – punukonumani
toduga nuṇḍenu – niku toduga nuṇḍenu || Sanvatsaradi ||
4. Ni korikanu siddimpa jesi – ni alocana saphalamu jeya
erigenu ayane ninnu – atmato nimpi – sarireccha trunci
korika neraveḷcenu – ni korika neraveḷcenu || Sanvatsaradi ||
5. Ninu preminci asirvadinci – abhivrud’dhi cetu nanina pramaṇamu
erigenu ayane ninnu – pasu sampadato – phala sasyamuto
truptiparatunanenu – santrupti paratunanenu || Sanvatsaradi ||
సంవత్సరాది మొదలు – సంవత్సరాంతము వరకు
నీ దేవుడేహోవా – నిను కనుపాపగా కాచెను
నీపై కనుదృష్టి నుంచెను – సంవత్సరాది మొదలు
1. నలువది సంవత్సరములు అరణ్యములో – నీ సంచార జీవితమును
ఎరిగెను ఆయనే నిన్ను – ఆశీర్వదించి – నీ చేతిపనిని
నిండుగా దీవించెను – నిండారుగ దీవించెను || సం ||
2. మునుపటికంటే అధికమైన – మేలులు నీకు కలుగజేయ
ఎరిగెను ఆయనే నిన్ను – అభివృద్ధి పరచి – విస్తృతి పరచి
వాసముగా చేసెను – నివాసనముగా జేసెను || సం ||
3. లెక్కకు మిక్కుట బంగారమును – ఇత్తడి ఇనుము నీ కలవని
ఎరిగెను ఆయనే నిన్ను – మందిర పనికి – పూనుకొనుమని
తోడుగా నుండెను – నీకు తోడుగా నుండెను || సం ||
4. నీ కోరికను సిద్దింప జేసి – నీ ఆలోచన సఫలము జేయ
ఎరిగెను ఆయనే నిన్ను – ఆత్మతో నింపి – శరీరేచ్ఛ త్రుంచి
కోరిక నెరవేర్చెను – నీ కోరిక నెరవేర్చెను || సం ||
5. నిను ప్రేమించి ఆశీర్వదించి – అభివృద్ధి చేతు ననిన ప్రమాణము
ఎరిగెను ఆయనే నిన్ను – పశూ సంపదతో – ఫల సస్యముతో
తృప్తిపరతుననెను – సంతృప్తి పరతుననెను || సం ||