Sresta geethamu vinabadu chunnadi yesu

Sresta geethamu vinabadu chunnadi yesu
lechenu – ee kasta lokamandu manaku
mithru daayane

1. Maaya kshitini rakshimpa vachinna parama
naayakudu – ee bhayankara cheekati
pogotta vachinna prabhuvu “Oh sresta”

2. Mundla kireetamunu dharinchi mukhamuna
gotta baden – aa gandu donganu siluvalo
vrelaadi rakshinchen “Oh sresta”

3. Heena maina eete toda prakkana grutcha
baden – aa paavana magu rakhta oota
pravahinchen “Oh sresta”

4. Moodava dinamuna samaadhi nundi
kartha lechenu – thana thodi sishyulu
choochu chunda naarohana maayen “Oh sresta”

5. Jayamu jayamu anuchu neevu
prakatinchumu – nee janmamella yesuni
goorchi saakshya meeyumu “Oh sresta”

6. Aarohana mai natlu marala vacheda
nanenu – ee dharaniki vencheyu
kaalamu sameepinchenu “Oh sresta”

7. Halleluya paaduchu naarbhaatamuga
naadu – aa vallabhu desu neduta
niluva nayaththa padumu “Oh sresta”

శ్రేష్టగీతము వినబడుచున్నది యేసు లేచెను – ఈ
కష్టలోకమందు మనకు మిత్రు – డాయనే

1. మాయక్షితిని రక్షింప వచ్చిన పరమ నాయకుడు – ఈ
భయంకర చీకటి పోగొట్ట వచ్చిన ప్రభువు
|| శ్రేష్టగీతము ||

2. ముండ్ల కిరీటమును ధరించి ముఖమున గొట్టబడెన్ – ఆ
గండుదొంగను సిలువలో వ్రేలాడి రక్షించెన్
|| శ్రేష్టగీతము ||

3. హీనమైన ఈటెతోడ ప్రక్కన గ్రుచ్చబడెను – ఆ
పావనమగు రక్త ఊట ప్రవహించెన్
|| శ్రేష్టగీతము ||

4. మూడవ దినమున సమాధి నుండి కర్త లేచెను – తన
తోడిశిష్యులు చూచుచుండ నారోహణమాయెన్
|| శ్రేష్టగీతము ||

5. జయము జయము అనుచు నీవు ప్రకటించుము – నీ
జన్మమెల్ల యేసుని గూర్చి సాక్ష్యమీయుము
|| శ్రేష్టగీతము ||

6. ఆరోహణమైనట్లు మరల వచ్చెద ననెను – ఈ
ధరణికి వేంచేయు కాలము సమీపించెను
|| శ్రేష్టగీతము ||

7. హల్లెలూయ పాడుచు నార్భాటముగ నాడు – ఆ
వల్లభుడేసు నెదుట నిలువ నాయత్తపడుము
|| శ్రేష్టగీతము ||

Leave a Comment