Stotramu stotramayyaa devaa

Stotramu stotramayyaa devaa – stotramu stotramayyaa

A. P. : Netramuvale gatha vatsaramu –
mitrudaa brochitivi – stotramu stotramayyaa

1. Yenno goppa keedulu maaku – pennuga kaliginan
anniyu ma chenta cherakundunatlu – mannadhipa brochiti

2. Perasa paapambula neevu – dharalamuga manninchi
ee vatsaramandu papamuna padakunda – novatsa kapadumu

3. Anandaarambamutho nindu ashato pravesinchi
bhoomiyandu rakshakuduga janminchina swami ninnu kolthumu

4. Ee krotha yedunandu Maakkara mellanniyu
satatamu maaku dayatoda thirchumo – vintha yesu rakshaka

5. Gaddiya jeevitamu neeto mudamuto salputaku
nityamu yesunu premato vembadimpa-nannu kanikarimpumu

6. Desa keedu tolganu – inka – dhosamulu veedanu
hosanna ekambuga paadutaku – dasula karunimpumu

7. Halleluya paatanu nee yeta nekkuvaga paadan
dikkulavariki suvartha prakatimpa – grakkuna varamulimmu

స్తోత్రము స్తోత్యమయ్యా దేవా – స్తోత్రము స్తోత్యమయ్యా

అనుపల్లవి : నేత్రమువలె గత వత్సరము – మిత్రుడా బ్రోచితివి
స్తోత్రము స్తోత్యమయ్యా

1. ఎన్నో గొప్ప కీడులు మాకు – పెన్నుగా కలిగినన్
అన్నియు మా చెంత చేరకుండునట్లు – మన్నాధిపా బ్రోచితి
|| స్తోత్రము ||

2. పేరాశ పాపంబుల నీవు – ధారాళముగ మన్నించి
ఈ వత్సరమందు పాపమున పడకుండ – నోవత్సా కాపాడుము
|| స్తోత్రము ||

3. ఆనందారంభంతో నిండు – ఆశతో ప్రవేశించి
భూమియందు రక్షకుడుగ జన్మించిన స్వామి నిన్ను కొల్తుము
|| స్తోత్రము ||

4. ఈ క్రొత్త యేడునందు మా అక్కర మేళ్ళన్నియు
సతతము మాకు దయతోడ తీర్చుమో – వింత యేసు రక్షకా
|| స్తోత్రము ||

5. గద్దియ జీవితము నీతో ముదముతో సల్పుటకు
నిత్యము యేసును ప్రేమతో వెంబడింప – నన్ను కనికరింపుము
|| స్తోత్రము ||

6. దేశకీడు తొల్గను – ఇంక – దోషములు వీడను
హోసన్నా ఏకంబుగా పాడుటకు – దాసుల కరుణింపుము
|| స్తోత్రము ||

7. హల్లెలూయా పాటను నీ ఏట నెక్కువగా పాడన్
దిక్కులవారికి సువార్త ప్రకటింప – గ్రక్కున వరములిమ్ము
|| స్తోత్రము ||

Leave a Comment