Stotrinchi keertinchedamu

Stotrinchi keertinchedamu Halleluya – Stuti
chellinchi yullasintumu Halleluya

A. P. : Gadachina kaalamella – kantipaapa vale kaachenu
prabhuvu mammu Halleluya – prabhun “Sto”

1. Paapamunu baapinaadu Halleluya mana
shaapamunu maapinaadu Halleluya
kannathalli valene – kanikarinchenu mammu
yenna tharamaa prema Halleluya – prabhun“Stotrinchi”

2. Thalliyaina marachinanu Halleluya thaanu
ennadaina marachipodu Halleluya – ella eevula
nitchi – yullaasa mosagunu kollaga
manala kori Halleluya – prabhun “Stotrinchi”

3. Shodhana kaalamulandu Halleluya mana
vedana kaalamu landu Halleluya naadhudu
yesu mana chenta nunda nila chintalemiyu
raavu – Halleluya – prabhun “Stotrinchi”

4. Ghora thuphaanu lennenno Halleluya bahu
ghoramuga lechinanu Halleluya doneyandunna
yesu – divyamuganu lechi dhaatigaa vaati
nanachu Halleluya prabhun “Stotrinchi”

5. Sarvalokamu nanduna Halleluya – nannu
saakshiga nunchenu yesu Halleluya
cherina vaarinella kori preminchunesu
cherchunu kaugitilo Halleluya prabhun “Stotrinchi”

స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయ
స్తుతి – చెల్లించి యుల్లసింతము హల్లెలూయ

అనుపల్లవి : గడచిన కాలమెల్ల – కంటిపాపవలె
కాచెను ప్రభువు మమ్ము హల్లెలూయ – ప్రభున్

1. పాపమును బాపినాడు హల్లెలూయ – మన
శాపమును మాపినాడు హల్లెలూయ
కన్నతల్లివలెనె – కనికరించెను మమ్ము
యెన్నతరమా ప్రేమ హల్లెలూయ – ప్రభున్
|| స్తోత్రించి ||

2. తల్లియైన మరచినను హల్లెలూయ – తాను
ఎన్నడైన మరచిపోడు హల్లెలూయ
ఎల్ల యీవుల నిచ్చి యుల్లాస మొసగును
కొల్లగ మనల కోరి హల్లెలూయ – ప్రభున్
|| స్తోత్రించి ||

3. శోధన కాలములందు హల్లెలూయ – మన
వేదన కాలములందు హల్లెలూయ
నాథుడు యేసు మన చెంతనుండ నిల
చింత లేమియు రావు హల్లెలూయ – ప్రభున్
|| స్తోత్రించి ||

4. ఘోర తుఫాను లెన్నెన్నో హల్లెలూయ – బహు
ఘోరముగ లేచినను హల్లెలూయ
దోనెయందున్న యేసు – దివ్యముగను లేచి
ధాటిగా వాటి నణచు హల్లెలూయ ప్రభున్
|| స్తోత్రించి ||

5. సర్వలోకమునందున హల్లెలూయ – నన్ను
సాక్షిగ నుంచెను యేసు హల్లెలూయ
చేరిన వారినెల్ల కోరి ప్రేమించు నేసు
చేర్చును కౌగిటిలో హల్లెలూయ ప్రభున్
|| స్తోత్రించి ||

Leave a Comment