Stutintun parishudduni aaraadanatho

Stutintun parishudduni aaraadanatho
inthavaraku kaache devude

1. Iruvadai dendlu gaachen – korataleni
mella nitche cherche prajala nendarino
cheripaadi stutinchedamu “Stutin”

2. Suvaartha sainyamu nitchi – bhuvipai
shatruni paninaape vinina vaarini
pratyekinche – cheri paadi stutinchedamu “Stutin”

3. Parishuddha sanghamu koorche – nerpe
Satya marmamulu – sariga saakshyamu
staapinche – cheri paadi stutinchedamu “Stutin”

4. Sevakula nitchenu bahugaa – kaavaliyunchen
prabhuve sahapani vaari nosage
cheri paadi stutinchedamu “Stutin”

5. Indiyaalo ee nagaru antiyokaiya vale
jese swantamuganu jesikonen
cheripaadi stutinchedamu “Stutin”

6. Parama darshanamu nitche – sarigaa
lobarache manala karamu nitche
nadipinche – cheripaadi stutinchedamu “Stutin”

7. Sangha marmamunu delpi – sheeghramuga
nampenu vaartha – maarche paapula
nendarino – cheripaadi stutinchedamu Halleluya “Stutin”

స్తుతింతున్ పరిశుద్దుని ఆరాధనతో – ఇంతవరకు కాచె దేవుడే

1. ఇరువదై దేండ్లు గాచెన్ – కొరతలేని మేళ్ళనిచ్చే
చేర్చె ప్రజల నెందరినో – చేరిపాడి స్తుతించెదము
|| స్తుతింతున్ ||

2. సువార్త సైన్యము నిచ్చి – భువిపై శత్రుని పనినాపే
వినిన వారిని ప్రత్యేకించె – చేరిపాడి స్తుతించెదము
|| స్తుతింతున్ ||

3. పరిశుద్ధ సంఘము కూర్చె – నేర్పె సత్య మర్మములు
సరిగ సాక్ష్యము స్థాపించె – చేరిపాడి స్తుతించెదము
|| స్తుతింతున్ ||

4. సేవకులనిచ్చెను బహుగా – కావలి యుంచెన్ ప్రభువే
సహపని వారి నొసగె – చేరిపాడి స్తుతించెదము
|| స్తుతింతున్ ||

5. ఇండియాలో ఈ నగరు – అంతియొకయ వలె జేసె
స్వంతముగను జేసికొనెన్ – చేరిపాడి స్తుతించెదము
|| స్తుతింతున్ ||

6. పరమ దర్శనము నిచ్చె – సరిగా లోబరచె మనల
కరము నిచ్చె నడిపించె – చేరిపాడి స్తుతించెదము
|| స్తుతింతున్ ||

7. సంఘ మర్మనును దెల్పి – శీఘ్రముగ నంపెను వార్త
మార్చె పాపుల నెందరినో – చేరి స్తుతించెదము హల్లెలూయ
|| స్తుతింతున్ ||

Leave a Comment