కంటిని గొప్ప ముత్యము – పొందితి హర్షము

“త్వరగా వెళ్ళి తొట్టిలో పడుకొనియున్న శిశువును చూచిరి” లూకా Luke 2:16

1. కంటిని గొప్ప ముత్యము – పొందితి హర్షము
తింటిని జీవాహారము – గ్రోలితి స్నేహము

2. మాత పితృడు యేసుడ – ద్భుత రాజాయనే
గుడ్డలు చుట్టబడెను – మందల కాపరి

3. ఆదియంత రహితుడు – జ్యోతిర్మయ ప్రభు
నార్తులకు నాయకుడు – జాతిగోత్రరహితుడు

4. యూదా గోత్రంపు సింహమా – పితృల దైవమా
నాథా నా హేమ మకుటమా – పాదముల బడితిమి

5. కర్తాదికర్త యేసువా – రాజాధిరాజవు
షారోను రోజా పుష్పమా – మరలవత్తువు

6. మార్గం సత్యం జీవమా – రోషంపు దేవుడా
కున్కని యాజకుండవు – ప్రకాశమయుడా

7. హల్లెలూయాకు పాత్రుడా – ఎల్లరి రక్షకా
రాతి గుండె కరిగింతువు – నీవే సమస్తము

రక్షకుని విచిత్ర ప్రేమన్ – పాడుచుందు నెప్పుడున్

“సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును” హెబ్రీ Hebrews 2:12

రక్షకుని విచిత్ర ప్రేమన్ – పాడుచుందు నెప్పుడున్
క్రూర సిల్వమీద మృతి నొంది నన్ విమోచించెన్

పల్లవి : పాడుడి రక్షకుని గూర్చి రక్తముతో కొనియె నన్
సిల్వపై రక్షణ ముద్రించి పాప అప్పును తీర్చెను

1. తెల్పుదున్ విచిత్ర కథన్ – పాడైన నా స్థితిని
కాచి కృపా ప్రేమతోడ – నన్ను విమోచించెను
|| పాడుడి ||

2. ప్రియ రక్షకును పాడి – జయశక్తి తెల్పుదున్
పాపమృతి పాతాళము – పై విజయమిచ్చెను
|| పాడుడి ||

3. నా రక్షకుని పరమ పాడి – ప్రేమగూర్చి పాడుదున్
చావు నుండి జీవమునకు – తెచ్చె దైవసుతుడు
|| పాడుడి ||

యేసుని నామ శబ్దము – విశ్వాసి చెవికి

“అతని నోరు అతి మధురము” పరమ గీతము Song Of Songs 5:16

1. యేసుని నామ శబ్దము – విశ్వాసి చెవికి
దివ్యమై యాదరించు – భీతిని ద్రోలును

2. గాయపడిన ఆత్మను – క్లేశహృదయము
నాకలి బాధ నార్పును – విశ్రాంతి నిచ్చును

3. ఇంపైన పేరు బండయు – డాలు నాశ్రయము
ధననిధీ కృపలతో – నన్నింపుచుండును

4. యేసూ నా ప్రియ కాపరి – ప్రవక్త నా రాజు
ప్రభూ జీవమార్గ సత్యం – మా స్తుతి వినుము

5. నా హృదయము దౌర్బల్యము – తలంపు వ్యర్థము
నిన్ను నే జూచినపుడు – సరిగా పూజింతును

6. శ్వాసించునపుడెల్లను – నీ ప్రేమ జాటుదున్
నీ నామ మధురమే నా – మృతిన్ ఆదరించున్

శ్రీ రక్షకుని నామము – కీర్తించి కొల్వుడి

దావీదు కుమారునికి జయము. ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి.” మత్తయి Matthew 21:9

1. శ్రీ రక్షకుని నామము – కీర్తించి కొల్వుడి
కిరీటముంచి చాటుడి – శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!

2. శ్రీ యేసుని హత సాక్షులారా – మీ రాజు యీయనే
కిరీటముంచి చాటుడి – శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!

3. నరులారా మీ కొరకు – మరణంబు నొందెను
కిరీటముంచి చాటుడి – శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!

4. సర్వ జనాంగములారా – శరణ్యు డీయనే
కిరీటముంచి చాటుడి – శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!

5. పరంబునందు యేసుకు గిరీటముంచుచు
హర్షంబుతో గీర్తింతుము – శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!

నృపా విమోచకా ప్రభూ – వేలాది నోళ్ల నీ

వారు ― సైన్యముల కధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి.” యెషయా Isaiah 6:3

1. నృపా విమోచకా ప్రభూ – వేలాది నోళ్ల నీ
గృపా జయప్రభావముల్ – నుతింతు నెంతయున్

2. కృపాధికార దేవ నీ సాయంబు జేయుమా
భవత్ప్రభావ కీర్తులన్ – జాటంగ నెల్లడన్

3. భయంబు చింతబాపును – హర్షంబు పాపికి
సౌఖ్యంబు జీవశాంతులు – నీనామ మిచ్చును

4. విముక్తి జేయు ఖైదిని – పాపంబు బావును
పాపాత్ము శుద్ధిచేయును శ్రీ యేసు రక్తము

5. జనాళి పాపు లెల్లరు – శ్రీ యేసున్ నమ్ముడి
కృపా విముక్తులందరు – సంపూర్ణ భక్తితో

6. అర్పించె యేసు ప్రాణమున్ – నరాళిగావను
యజ్ఞంబు దేవ గొఱ్ఱెపై – నఘంబు వేయుడి

7. సత్కీర్తి స్తోత్ర ప్రేమల – నభావ భూమిని
సర్వత్ర దేవుడొందుగా – సద్భక్తవాళిచే