యెహోవయే దయాదాక్షిణ్యములు కలిగినవాడు

“యెహోవా అందరికి ఉపకారి. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యములమీద నున్నవి.” కీర్తన Psalm 145:8-16

యెహోవయే దయాదాక్షిణ్యములు కలిగినవాడు
దీర్ఘశాంతము కృపాతిశయము కలిగినవాడు

పల్లవి : యెహోవా అందరికిని మహోపకారుండు
ఆయన కనికరమాయన పనులపై నున్నది

1. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి నీ క్రియలు
నీ భక్తులందరు నిన్ను స్తుతించెదరు గాక
|| యెహోవా ||

2. నీ భక్తులు నీ ప్రభావమును మానవులకు దెల్పెదరు
నీ శౌర్యమునుగూర్చి నీ భక్తులు పల్కెదరు
|| యెహోవా ||

3. నీ రాజ్యము శాశ్వత రాజ్యమని తెల్పెదరు
నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును
|| యెహోవా ||

4. యెహోవా పడినవారినెల్ల నుద్ధరించును
కృంగిపోయిన వారినెల్లర లేవనెత్తును
|| యెహోవా ||

5. సర్వజీవుల కన్నులు నీవైపు చూచుచున్నవి
తగినట్టి వేళ నీవు వారికి ఆహారమిత్తువు
|| యెహోవా ||

6. యెహోవా దేవా నీ గుప్పిలిని నిత్యము విప్పి
ప్రతి జీవి కోరిక నెల్లను తృప్తిపరచుచున్నావు
|| యెహోవా ||

యెహోవా – నీవు నన్ను పరిశీలించి

“యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలిసికొని యున్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును. నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు.” కీర్తన Psalm 139:1-10

పల్లవి : యెహోవా – నీవు నన్ను పరిశీలించి, తెలిసికొంటివి
నేను కూర్చుం – డుటయు లేచుట
నీకు తెలియును తలంపు నెరుగుదువు

1. పరిశీలించి యున్నావు నీవు నా నడక పడకలను
నా చర్యలన్నిటిని బాగుగా నీవు యెరిగియున్నావు
|| యెహోవా ||

2. యెహోవా మాట నా నాలుకకు రాక – మునుపే యెరుగుదువు
ముందు వెనుకల నన్నావరించి నీ చేతిని నాపై నుంచితివి
|| యెహోవా ||

3. నాకు బహుమించియున్నదిట్టి తెలివి – నా కగోచరము
నీ యాత్మను నీ సన్నిధిని విడిచి యెచ్చటికి – పారిపోవుదును
|| యెహోవా ||

4. నే నాకాశమున కెక్కినప్పటికిని నీ – వచ్చట నున్నావు
పాతాళమందు పండుకొనినను – నీవు అచ్చట నున్నావు
|| యెహోవా ||

5. సముద్ర దిగంతములలో నేను వేకువ – రెక్కలు కట్టుకొని
వసించిన నీదు హస్తము పట్టుకొని – నన్ను నడిపించున్
|| యెహోవా ||

 

యెహోవాను స్తుతించుడి ఆయన దయాళుడు

“యెహోవా దయాళుడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును.” కీర్తన Psalm 136:1-9

యెహోవాను స్తుతించుడి ఆయన దయాళుడు

పల్లవి : ఆయన కృప నిరంతరముండును
ఆయన కృప నిరంతరముండును
ఆయన కృప నిరంతరముండును

1. దేవదేవునికి స్తుతులు చెల్లించుడి – ఆయన
||ఆయన||

2. ప్రభువుల ప్రభువునకు స్తుతులు చెల్లించుడి – ఆయన
||ఆయన||

3. ఆశ్చర్యకార్యముల చేయువాని స్తుతించుడి – ఆయన
||ఆయన||

4. ఆకాశము జ్ఞనముచే జేసినవాని స్తుతించుడి – ఆయన
||ఆయన||

5. నీళ్ళమీద భూమిని పరచినవాని స్తుతించుడి – ఆయన
||ఆయన||

6. గొప్ప జ్యోతులు నిర్మించినవాని స్తుతించుడి – ఆయన
||ఆయన||

7. పగటినేలు సూర్యుని చేసినవాని స్తుతించుడి – ఆయన
||ఆయన||

8. రాత్రినేలు చంద్రుని చేసినవాని స్తుతించుడి – ఆయన
||ఆయన||

యెహోవా సేవకులారా స్తుతించుడి

“యెహోవా దయాళుడు. యెహోవాను స్తుతించుడి. ఆయన నామమును కీర్తించుడి. అది మనోహరము.” కీర్తన Psalm 135:1-14

పల్లవి : యెహోవా సేవకులారా స్తుతించుడి
ఆయన నామమును స్తుతించుడి

అనుపల్లవి : యెహోవా మందిర ఆవరణములలో
నిలుచుండు వారలారా మీరు

1. యెహోవా దయాళుడు ఆయన నామమును
కీర్తించుడి అది మనోహరము
యాకోబును తనకొర కేర్పరచుకొని
ఇశ్రాయేలును స్వకీయ ధనముగా కొనెన్
|| యెహోవా ||

2. యెహోవా సకల దేవతల కంటెను
గొప్పవాడని నేనెరుంగుదున్
భూమ్యాకాశములు మహా సముద్రము
లందాయన కిష్టమైనవి చేసెను
|| యెహోవా ||

3. భూమి దిగంతముల నుండి ఆవిరి
లేవజేసి వాన కురియునట్లు
మెరుపును పుట్టించి తన నిధులలో నుండి
గాలిని బయలు వెళ్ళఁజేయు వాడాయనే
|| యెహోవా ||

4. ఐగుప్తు జనుల తొలిచూలులను
పశువుల తొలిచూలుల జంపెను
ఫరో యెదుట వాని ఉద్యోగుల యెదుట
సూచనల మహాత్కార్యముల జేసె
|| యెహోవా ||

5. అన్యులనేకులను శక్తిగల
రాజులనేకులను చంపెను
అమోరీయుల రాజైన సీహోనును
బాషాను రాజగు ఓగును చంపెను
|| యెహోవా ||

6. కనాను రాజ్యముల పాడుచేసియు
నిశ్రాయేలేయుల కప్పగించెను
యెహోవా నీ నామము నిత్యముండున్
నీ జ్ఞాపకార్థము తర తరములకును
|| యెహోవా ||

7. యెహోవా తనదగు ప్రజలకు తానే
న్యాయము తీర్చును హల్లెలూయ
తన వారగు తన సేవకులను బట్టి
సంతాపము నొందు నాయనల్లేలూయ
|| యెహోవా ||

సహోదరులు ఐక్యత కల్గి వసించుట

“సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!” కీర్తన Psalm 133

పల్లవి : సహోదరులు ఐక్యత కల్గి వసించుట
ఎంత మేలు ఎంత మనోహరముగా నుండును

1. అది అహరోను తలపై పోయబడియు
క్రిందికి గడ్డముపై కారి – నట్టులుండును
|| సహోదరులు ||

2. అంగీల అంచు వరకును దిగజారిన
పరిమళ తైలమువలె – నదియుండును
|| సహోదరులు ||

3. సీయోను కొండ మీదికి – దిగివచ్చునట్టి
హెర్మోను మంచువలె నైక్యత యుండును
|| సహోదరులు ||

4. ఆశీర్వాదమును శాశ్వత జీవము నచ్చట
యుండవలెనని యెహోవా సెలవిచ్చెను
|| సహోదరులు ||