Paraloka rajyamu cherutaku

Paraloka rajyamu cherutaku – prabhu Yesu margambu
marga satya jeevamu neneyani Yesu palkenu

1. Sarvalokula papa – pariharardamu sri Yesu
parisudha rakthamu chindinche – baliyayenu sri Yesu “Para”

2. Papapariharardam – papa rakthamu nichena
Yesuni chera priyuda – samsayamadiyela “Para”

3. Nenu preminche pranamu – nekai pettina Yesune
naku valadanchu velluta – nyayama priyuda “Para”

4. Maraninchina Yesu prabhuvu – mudavanadu lechenu
mahima prabavamuto Yesu – maranamu gelchenu “Para”

5. Takshaname maaru manassu – nondi Yesuni nammina
rakshana nondedavu – nichayamugano – priyuda “Para”

పరలోక రాజ్యము చేరుటకు – ప్రభుయేసే మార్గంబు
మార్గ సత్య జీవము నేనేయని యేసే పల్కెను

1. సర్వలోకుల పాప – పరిహారార్థము శ్రీ యేసు
పరిశుద్ధ రక్తము చిందించి – బలియాయెను శ్రీ యేసు
|| పరలోక ||

2. పాపపరిహారార్థము – పావన రక్తము నిచ్చిన
యేసుని చేర ప్రియుడా – సంశయమదియేల
|| పరలోక ||

3. నిను ప్రేమించి ప్రాణము – నీకై పెట్టిన యేసుని
నాకు వలదంచు వెళ్ళుట – న్యాయమా ప్రియుడా
|| పరలోక ||

4. మరణించిన యేసు ప్రభువు – మూడవనాడు లేచెను
మహిమా ప్రభావముతో యేసు – మరణము గెల్చెను
|| పరలోక ||

5. తక్షణమే మారు మనస్సు – నొంది యేసును నమ్మిన
రక్షణ నొందెదవు – నిశ్చయముగనో – ప్రియుడా
|| పరలోక ||

Maharaja Yesu nekai

Maharaja Yesu nekai mahima kalugu gaka

A. P. : Ganata prabavamu nede nitya rajyamu nede

1. Kanyagarabamuna janmincha sankapinchukonnave
papamella naasamu cheya papi roopamu dalchitive “Maha”

2. Siluvasramalnu sahinchi maranamu ruchinchitive
pranamupetti mamu rakshnchi tandrini truptiparachitive “Maha”

3. Papa marana narakamunundi rakshimpa sankalpinchi
triyeka devunito jercha chedugu teesi vesitive “Maha”

4. Papi devuniche maaru manasuna ponduma
athmanugraha kalamuna vachchi rakshna ponduma “Maha”

మహారాజా యేసు నీకే మహిమ కలుగు గాక

పల్లవి : ఘనత ప్రభావము నీదే నిత్యరాజ్యము నీదే

1. కన్యగర్భమున జన్మించ సంకల్పించుకొన్నావే
పాపమెల్ల నాశము చేయ పాపి రూపము దాల్చితివే
|| మహారాజా ||

2. సిలువశ్రమలను సహించి మరణము రుచించితివే
ప్రాణము పెట్టి మము రక్షించి తండ్రిని తృప్తిపరచితివే
|| మహారాజా ||

3. పాప మరణ నరకమునుండి రక్షింప సంకల్పించి
త్రియేక దేవునితో జేర్చ చెడుగు తీసి వేసితివే
|| మహారాజా ||

4. పాపీ దేవునిచే మారు మనస్సును పొందుమా
ఆత్మానుగ్రహ కాలమున వచ్చి రక్షణ పొందుమా
|| మహారాజా ||