Kontha samayame migilinadi

Kontha samayame migilinadi – kristesu prabhuvu
thirigi vachun – leshamainanu jaagu cheyadu

1. Prabhu vachu varaku kanipettumu – nishchayamugaa
aayana vachunu – prabhu raaka nevaru preminthuro –
vaarini prabhuvu konipovunu “Kontha”

2. Aayana raakada sameepamu – sahavaasamulo
nilichi yundi prabhu vaakyamunaku lobadiyu –
aayana korakai kanipettedam “Kontha”

3. Adugantu chunnadi aatmeeyatha – andari premalu
challaaregaa kannulu therachi melconudi –
viduvabadina mee gathi yemagun “Kontha”

4. Thama swantha panulalo viswaasulu – kondaru
nidrinchu chunnaarugaa – melconu vaareththa baduduruviduva
badina vaari gathi yemagun “Kontha”

5. Novahu kaalamun smariyinthamu – samasthamunu
diddukoni vidudala dina maasanna maaye –
vimochanaa vishraanthi nitchu “Kontha”

కొంతసమయమే మిగిలినది
క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చున్
లేశమైనను జాగుచేయడు

1. ప్రభు వచ్చువరకు కనిపెట్టుము
నిశ్చయముగా ఆయన వచ్చును
ప్రభురాక నెవరు ప్రేమింతురో
వారిని ప్రభువు కొనిపోవును
|| కొంతసమయమే ||

2. ఆయన రాకడ సమీపము
సహవాసములో నిలిచియుండి
ప్రభు వాక్యమునకు లోబడియు
ఆయన కొరకై కనిపెట్టెదం
|| కొంతసమయమే ||

3. అడుగంటుచున్నది ఆత్మీయత
అందరి ప్రేమలు చల్లారెగా
కన్నులు తెరచి మేల్కొనుడి
విడువబడిన మీగతి యేమగున్
|| కొంతసమయమే ||

4. తమ స్వంత పనులలో విశ్వాసులు
కొందరు నిద్రించు చున్నారుగా
మేల్కొను వారెత్తబడెదరు
విడువ బడిన వారిగతి యేమగున్
|| కొంతసమయమే ||

5. నోవహు కాలమున్ స్మరియింతుము
సమస్తమును దిద్దుకొని
విడుదల దిన మాసన్నమాయె
విమోచనా విశ్రాంతి నిచ్చు
|| కొంతసమయమే ||

Yesu kristu sheeghramuga

Yesu kristu sheeghramuga, sheeghramuga, sheeghramuga yesu
kristu sheeghramuga digi vachchunu
digivachchunu, – digivachchunu – Yesu kristu
sheeghramuga digivachchunu

2. Sandhimpa neevaayaththamaa aayaththmaa aayaththamaa
sandhimpa neevaaththamaa Yesu raakadan

3. Leni yedala siddhapadu siddhapadu siddhapadu
leni yedala siddhapadu krupa kaalamuna

4. Bhakhtulellaru siddhapadi siddhapadi siddhapadi
bhakhtulellaru siddhapadi kaachi yunduru

యేసుక్రీస్తు శీఘ్రముగ శీఘ్రముగ శీఘ్రముగ
యేసుక్రీస్తు శీఘ్రముగ దిగివచ్చును
దిగివచ్చును – దిగివచ్చును – యేసుక్రీస్తు శీఘ్రముగ దిగివచ్చును

2. సంధింప నీవాయత్తమా ఆయత్తమా ఆయత్తమా
సంధింప నీవాయత్తమా యేసురాకడన్

3. లేనియెడల సిద్ధపడు సిద్ధపడు సిద్ధపడు
లేనియెడల సిద్ధపడు కృపకాలమున

4. భక్తులెల్లరు సిద్ధపడి సిద్ధపడి సిద్ధపడి
భక్తులెల్లరు సిద్ధపడి కాచియుందురు