Meghaaroodundai

Meghaaroodundai – prabhu yesu, athi
vegamuga nethenchun – yethenchun, yethenchun
aakaasamunde vaadaina Yesu ilaku nethenchun

1. Aakaashamandaayananu – sandimpa
ekamuga neguduru – nija visvasulandaru “Me”

2. Paapabandakamul aayane trunchun
paapamula nedabaapun prabhu yese ninu rakshinchun “Me”

3. Rakthamuche vimochana mondi
yesutho nega nayathamaa ? kristese – neekai – raagan “Me”

4. Saswatha jeevamu nichunu neeku
thandritho naikyaparchunin –
sadaa tanathone ninnunchun “Me”

మేఘా రూఢుండై – ప్రభుయేసు, అతి వేగముగా నేతెంచున్
ఏతెంచున్ ఏతెంచున్
ఆకాశమునుండే వాడైన యేసు యిలకు నేతెంచున్

1. ఆకాశమందాయనను – సంధింప
ఏకముగ నేగుదురు – నిజ విశ్వాసులందరు
|| మేఘా రూఢుండై ||

2. పాపబంధకముల్ ఆయనే త్రుంచున్
పాపముల నెడబాపున్ ప్రభుయేసే నినురక్షించున్
|| మేఘా రూఢుండై ||

3. రక్తముచే విమోచన మొంది
యేసుతో నేగ నాయత్తమా? క్రీస్తేసే – నీకై రాగన్
|| మేఘా రూఢుండై ||

4. శాశ్వత జీవము నిచ్చును నీకు
తండ్రితో నైక్యపర్చునిన్ – నదాతనతోనే నిన్నుంచున్
|| మేఘా రూఢుండై ||

Raajaadhi raajaa raave

Raajaadhi raajaa raave – raaju yesu raajyamela raave
vairaajulaku raajuvai raave – ravikoti teja yesu raave
O……. megha vaahanambu meeda vegame
O……. minchu vaibavambuthoda vegame

1. O……. Bhujanmbulella theri choodagaa
O……. nee janambu swagathambu neeyagaa
nee raajya sthaapanambu cheya –
bhuraajulella goolipova
bhoomiyakashambu maaripova –
nee mahaaprabavamuna vega “Raja”

2. aa… akasamuna dootalaarbhaatimpagaa
aa… aadi baktha sangha samethambugaa
aakaasambu madhya veedhilona – “Raja”
ekamai mahasabacheya
yesunaadha! needu mahimalona –
makade mahaanandamouga “Raja”

3. O……. parama yerusalemu punya sangamaa !
O……. gorrepilla kristhu punya sangamaa !
parama dootalaaraa ! bhakthulaaraa ! paulapostulaaraa !
peddalara ! goriyapilla yesuraju pera –
krotha geethametthi paadaraaraa “Raja”

రాజాధిరాజా రావే – రాజు యేసు రాజ్యమేల రావే
రాజులకు రాజువై రావే – రవికోటి తేజ యేసు రావే
ఓ … మేఘ వాహనంబు మీద వేగమే
ఓ … మించు వైభవంబుతోడ వేగమే

1. ఓ … భూజనంబులెల్ల తేరి చూడగా
ఓ … నీ జనంబు స్వాగతంబు నీయగా
నీ రాజ్య స్థాపనంబు చేయ – భూరాజులెల్ల గూలిపోవ
భూమియాకాశంబు మారిపోవ – నీ మహాప్రభావమున వేగ
|| రాజాధిరాజా ||

2. ఆ … ఆకసమున దూతలార్భటింపగా
ఆ … ఆది భక్త సంఘ సమేతంబుగా
ఆకసంబు మధ్య వీధిలోన – ఏకమై మహాసభచేయ
యేసునాథ! నీదు మహిమలోన – మాకదే మహానందమౌగ
|| రాజాధిరాజా ||

3. ఓ … పరమ యెరూషలేము పుణ్యసంఘమా !
ఓ … గొఱ్ఱెపిల్ల క్రీస్తు పుణ్యసంఘమా !
పరమదూతలారా ! భక్తులారా ! పౌలపొస్తులారా !
పెద్దలారా ! గొఱియపిల్ల యేసురాజు పేర – క్రొత్త గీతమెత్తి పాడరారా
|| రాజాధిరాజా ||