Yesuraju vachunu dootalatho

Yesuraju vachunu dootalatho vachchunu daasula paramuna jerchutaku yesuni mukha jyotini Juchedamu jaya dwanulache nuppengadamu “Yesu”

2. Sanga vadhuvu pendli kumarundesutho – mangala geethamu padumu naadu mahimalo manamu paadedamu yesu snehampu lothunu ruchiyintumu “Yesu”

3. Mudra nondhi shuddulu tellanangi darinchi shuddhuni mungita nilichedaru naadu swama kireetamu daalchi andu paaduchu prakaasinchedamu “Yesu”

4. Yesune preminchiti – loka sneham veediti sadaa naa yesutho muchatintun Aaha! bhaasillu mahimatho muchatintun
naadu prabhu yesunitho sukha mondedan “Yesu”

5. Paraloka booradwani mrogagane – parishuddulegiri velledaru aa satyuni kalyana vindulo manamesutho narbhatinchedamu “Yesu”

యేసురాజు వచ్చును దూతలతో వచ్చును
దాసుల పరమున జేర్చుటకు
యేసుని ముఖజ్యోతిని జూచెదము
జయ ధ్వనులచే నుప్పొంగెదము

2. సంఘ వధువు పెండ్లి కుమారుండేసుతో
మంగళ గీతము పాడును
నాడు మహిమలో మనము పాడెదము
యేసు స్నేహంపు లోతును రుచియింతుము

3. ముద్ర నొంది శుద్ధులు తెల్ల నంగి ధరించి
శుద్ధుని ముంగిట నిలిచెదరు నాడు
స్వర్ణ కిరీటమును దాల్చి
అందు పాడుచు ప్రకాశించెదము

4. యేసునే ప్రేమించితి – లోక స్నేహం వీడితి
సదా నా యేసుతో ముచ్చటింతున్
ఆహా! భాసిల్లు మహిమతో ముచ్చటింతున్
నాడు ప్రభు యేసునితో సుఖ మొందెదన్

5. పరలోక బూరధ్వని మ్రోగగానే
పరిశుద్ధులెగిరి వెళ్ళెదరు – ఆ
సత్యుని కళ్యాణ విందులో
మన మేసుతో నార్భటించెదము

Kristu nedu lechenu – marthya doota

Kristu nedu lechenu – marthya doota
sanghamaa – bhoomi naakaashambulo –
baadu vindu chetanu

2. Moksha miyaa naadhudu – yudda maadi
gelchenu – sooryu dudbavimpaga –
jeekatul gatinchenu

3. Banda, mudra, kaavali – anni vyardha –
mainavi – yesu narakambunu gelchi
mukhti dechenu

4. Kristu lechinappudu – chaavu mullu thrunchenu – ellavaarin brochunu –
mruthyu vinka gelvadu

5. Yesu mruti gelchenu – memu kooda gelthumu – yesudundu chotaku – memu kooda bothumu

6. Bhoomi naakasambulo – yesu, neeku stotramu – mruthyu samhaarakunda –
neekenu vijayamu

క్రీస్తు నేడు లేచెను – మర్త్య దూత సంఘమా
భూమి నాకాసంబులో – బాడు విందుచేతను

2. మోక్ష మియ్య నాథుదు – యుద్ధమాడి గెల్చెను
సూర్యుడుద్భవింపగ – జీకటుల్ గతించెన్

3. బండ, ముద్ర, కావలి – అన్ని వ్యర్థమైనవి
యేసు నరకంబును – గెల్చి ముక్తి దెచ్చెను

4. క్రీస్తు లేచినప్పుడు – చావు ముల్లు త్రుంచెను
ఎల్లవారి బ్రోచును – మృత్యు వింక గెల్వదు

5. యేసు మృతి గెల్చెను – మేము కూడ గెల్తుము
యేసుడుండు చోటుకు – మేము కూడఁ బోదుము

6. భూమి నాకాసంబులో – యేసు, నీకు స్తోత్రము
మృత్యు సంహారకుండ – నీకేను విజయము