Niraakaaraa, suroopudaa, manoharaa

Niraakaaraa, suroopudaa, manoharaa
karigitiva naakai vreladuchu – siluvalo

1. Vaarula debbala badha nondi –
vaadi mekulato gruchabadi
teerani daahamu sahinchitivi – siluvalo “Nira”

2. Maanavulu yedchi pralaapimpa –
bhurajulellaru maadipoga
shishyula dendamulu pagula – siluvalo “Nira”

3. Arachi pranamu veedina sutudaa
vairi ne nee padamula baditini
kori rakshana neraverchitivi – siluvalo “Nira”

4. Kori silva bharamunu mositivi –
papabharamunu druchitivi
ghora gayamulu ponditivi – siluvalo “Nira”

5. Nannu rakshimpanu yenni patlan –
pennuga neevu sahinchitivi
nannu nee chittamuna biddacheya – siluvalo “Nira”

6. Krurudu prakka neete gruchachagaa –
needu rakthamunu paarenayya
teerugaa ne rakshana pondanu – siluvalo “Nira”

7. Okkadagu nithya devunike –
okkadagu sutudesonake
okkadagu sathya aatma neeke – halleluya “Nira”

నిరాకారా, సురూపుడా, మనోహరా
కరిగితివా నాకై వ్రేలాడుచు – సిలువలో

1. వారుల దెబ్బలబాధ నొంది – వాడి మేకులతో గ్రుచ్చబడి
తీరని దాహము సహించితివి – సిలువలో
|| నిరాకారా ||

2. మానవులు ఏడ్చి ప్రలాపింప – భూరాజు లెల్లరు మాడిపోగా
శిష్యుల డెందములు పగుల – సిలువలో
|| నిరాకారా ||

3. అరచి ప్రాణము వీడిన సుతుడా – వైరి నే నీ పాదముల బడితిని
కోరి రక్షణ నెరవేర్చితివి – సిలువలో
|| నిరాకారా ||

4. కోరి సిల్వభారమును మోసితివి – పాపభారమును ద్రుంచితివి
ఘోర గాయములు పొందితివి – సిలువలో
|| నిరాకారా ||

5. నన్ను రక్షింపను ఎన్ని పాట్లన్ – పెన్నుగ నీవు సహించితివి
నన్ను నీ చిత్తమున బిడ్డచేయ – సిలువలో
|| నిరాకారా ||

6. కౄరుడు ప్రక్కనీటె గ్రుచ్చగా – నీదు రక్తమును పారెనయ్యా!
తీరుగా నే రక్షణ పొందను – సిలువలో
|| నిరాకారా ||

7. ఒక్కడగు నిత్య దేవునికే – ఒక్కడగు సుతుడేసునకే
ఒక్కడగు సత్య ఆత్మ నీకే – హల్లెలూయా
|| నిరాకారా ||

Udayinche divya rakshakudu

Udayinche divya rakshakudu ghoraandhakaara
lokamuna mahima kristu udayinchenu –
rakshana velugu niyyanu (2)

1. Ghoraandhakaaramuna deepambu leka – palumaaru
paduchundagaa dhukka niraasha yaatrikulanthaadaari
thappi yundagaa marga darshiyai nadipinchu
vaarin – prabhu paada sannidiki divya rakshakudu
prakaasha velugu – udayinche ee dharalo “Uda”

2. Chintha vichaaramutho nindi yunna – lokarodanavini
paapambunundi nashinchipogaa – aatma
vimochakudu maanavaalikai maranambunondi –
nitya jeevamunivvan – divya rakshakudu
prakaasha thaara – udayinche rakshimpan “Uda”

3. Paraloka thandri karuninchi manala – pampenu
kristu prabhun lokaandhulaku drusti nivva –
aruthenche kristu prabhuvu – cheekatinundi
daiva velugu naku – thechche kristu prabhuvu
saataanu shrunkhalamulanu thempa – udayinche
rakshakudu “Uda”

ఉదయించె దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున
మహిమ క్రీస్తు ఉదయించెను రక్షణ వెలుగునియ్యను

1. ఘోరాంధకారమున దీపంబులేక – పలుమారు పడుచుండగా
దుఃఖ నిరాశ యాత్రికులంతా – దారితప్పియుండగా
మార్గదర్శియై నడిపించువారిన్ – ప్రభుపాద సన్నిధికి
దివ్యరక్షకుడు ప్రకాశ వెలుగు – ఉదయించె ఈ ధరలో
|| ఉదయించె ||

2. చింతవిచారముతో నిండియున్న – లోకరోదనవిని
పాపంబునుండి నశించిపోగా – ఆత్మవిమోచకుడు
మానవాళికై మరణంబునొంది – నిత్య జీవము నివ్వన్
దివ్యరక్షకుడు ప్రకాశతార – ఉదయించె రక్షింపను
|| ఉదయించె ||

3. పరలోక తండ్రి కరుణించి మనల – పంపెను క్రీస్తుప్రభున్
లోకాంధులకు దృష్టి నివ్వ – అరుదెంచె క్రీస్తు ప్రభువు
చీకటినుండి దైవ వెలుగునకు – తెచ్చె క్రీస్తు ప్రభువు
సాతాను శృంఖలములను తెంప – ఉదయించె రక్షకుడు
|| ఉదయించె ||