I sudinamu – yesu prabhuva – nidu danam

I sudinamu – yesu prabhuva – nidu danam

1. Parisuddhambaina – samajaku-tamulan maku
prasadinci – vistaramagu – premanu jupi – vijayotsavamun
nadupucunna – yesu prabhuva – nike mahima
|| i sudinamu ||

2. Nutanambaina – yerusalemu – anu pattanamu
bhartakoraku – pendli kumarte – vale siddhapadi – devuni nundi
vaccuta cuci – sanstutincu – cunnamilalo
|| i sudinamu ||

3. Sampurnambaina – siddhini memu – pondedamilalo
svacchambaina – ni cittamulo – nilakada kalgi – prarthana yandu
poradedamu – nidu krpato – yesu prabhuva
|| i sudinamu ||

4. Svarnalankrtamai – suryakanta – padmaraga – ratnavalito
yesu prabhuni – mahimato merise – parisuddha pa-
ttanamuga mammu – jesina prabhuva
|| i sudinamu ||

ఈ సుదినము – యేసు ప్రభువా – నీదు దానం

1. పరిశుద్ధంబైన – సమాజకూ-టములన్ మాకు
ప్రసాదించి – విస్తారమగు – ప్రేమను జూపి – విజయోత్సవమున్
నడుపుచున్న – యేసు ప్రభువా – నీకే మహిమ
|| ఈ సుదినము ||

2. నూతనంబైన – యెరూషలేము – అను పట్టణము
భర్తకొరకు – పెండ్లి కుమార్తె – వలె సిద్ధపడి – దేవుని నుండి
వచ్చుట చూచి – సంస్తుతించు – చున్నామిలలో
|| ఈ సుదినము ||

3. సంపూర్ణంబైన – సిద్ధిని మేము – పొందెదమిలలో
స్వచ్ఛంబైన – నీ చిత్తములో – నిలకడ కల్గి – ప్రార్థన యందు
పోరాడెదము – నీదు కౄపతో – యేసు ప్రభువా
|| ఈ సుదినము ||

4. స్వర్ణాలంకృతమై – సూర్యకాంత – పద్మరాగ – రత్నావళితో
యేసు ప్రభుని – మహిమతో మెరిసే – పరిశుద్ధ ప-
ట్టణముగ మమ్ము – జేసిన ప్రభువా
|| ఈ సుదినము ||

Naa priyudu naavaadu nenu athani vaadanu

Naa priyudu naavaadu nenu athani vaadanu “Nenu”

1. Neevu bahu priyunda vanuchu – Daaniyelunaku
divyamuga nabhayambitchina maa paramajanakundaa
“Maadu”

2. Eeyane naa santasamaina – priya thanayundu
eeyana maata vinudanina – parama janakundaa “Maadu”

3. Enni sandramula jalaraasul – aarpagaaleni
unnathambaina nee preman – enna maa tharamaa “Preman”

4. Calvarin chindinchina needu – rakhta dhaaralatho kadigitivi
maa paapamulanni – karunagala kristu “Maadu”

5. Maapai napavaadi nadi boli – porli paarinanu munchi
veyaga jaaladu mammu – maatho nee vundan“Priyudaa”

6. Krotha vatsaramunu daanamugaa nitchina kristu
kshana kshanam nadipintuvu mammu vijayavantamugaa”Mammu”

7. Needu raakadakai dina dinamu – vechiyunnaamu
nityamahimalo neetho memu – merayuchundumu “Memu”

నా ప్రియుడు నావాడు నేను అతని వాడను

1. నీవు బహు ప్రియుండవనుచు – దానియేలునకు
దివ్యముగ నభయంబిచ్చిన మా – పరమజనకుండా
|| నా ప్రియుడు ||

2. ఈయనే నా సంతసమైన – ప్రియతనయుండు
ఈయన మాట వినుడనిన – పరమజనకుండా
|| నా ప్రియుడు ||

3. ఎన్ని సంద్రముల జలరాసుల్ – ఆర్పగాలేని
ఉన్నతంబైన నీ ప్రేమన్ – ఎన్న మా తరమా
|| నా ప్రియుడు ||

4. కల్వరిన్ చిందించిన నీదు – రక్త ధారలతో
కడిగితివి మా పాపములన్ని – కరుణగల క్రీస్తు
|| నా ప్రియుడు ||

5. మా పై నపవాది నదిబోలి – పొర్లిపారినను
ముంచి వేయగ జాలదు మమ్ము – మాతో నీ వుండన్
|| నా ప్రియుడు ||

6. క్రొత్త వత్సరమును దానముగా – నిచ్చిన క్రీస్తు
క్షణక్షణం నడిపింతువు మమ్ము – విజయవంతముగా
|| నా ప్రియుడు ||

7. నీదు రాకడ కై దినదినము – వేచియున్నాము
నిత్య మహిమలో నీతో మేము – మెరయుచుందుము
|| నా ప్రియుడు ||