యేసు ప్రభును స్తుతించుట

“యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు. నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు. నేను ఆశ్రయించియున్న నా దుర్గము.” కీర్తన Psalm 18:2

పల్లవి : యేసు ప్రభును స్తుతించుట
యెంతో యెంతో మంచిది

1. విలువైన రక్తము సిలువలో కార్చి
కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగెను
|| యేసు ||

2. ఎంతో గొప్ప రక్షణ నిచ్చి
వింతైన జనముగా మము జేసెను
|| యేసు ||

3. మా శైలము మా కేడెము
మా కోటయు మా ప్రభువే
|| యేసు ||

4. ఉన్నత దుర్గము రక్షణ శృంగము
రక్షించువాడు మన దేవుడే
|| యేసు ||

5. అతిసుందరుడు అందరిలోన
అతి కాంక్షణీయుడు అతి ప్రియుడు
|| యేసు ||

6. రాత్రింబవళ్ళు వేనోళ్ళతోను
స్తుతుంచుటయే బహు మంచిది
|| యేసు ||

భక్తులారా స్మరియించెదము

“ఈయన సమస్తమును బాగుగా చేసియున్నాడు.” మార్కు Mark 7:37

పల్లవి : భక్తులారా స్మరియించెదము
ప్రభుచేసిన మేలులన్నిటిని
అడిగి ఊహించు వాటికన్న
మరి సర్వము చక్కగ జేసె

1. శ్రీయేసే మన శిరస్సై యుండి
మహాబలశూరుండు
సర్వము నిచ్చెను తన హస్తముతో
ఎంతో దయగల వాడు
|| భక్తులారా ||

2. గాలి తుఫానులను గద్దించి
బాధలను తొలగించే
శ్రమలలో మనకు తోడైయుండి
బయలు పరచె తన జయమున్
|| భక్తులారా ||

3. జీవ నదిని ప్రవహింపజేసె
సకల స్థలంబుల యందు
లెక్కకుమించిన ఆత్మలతెచ్చె
పభువే స్తోత్రార్హుండు
|| భక్తులారా ||

4. అపోస్తలుల, ప్రవక్తలను
సువార్తికులను యిచ్చె
సంఘము అభివృద్ధిని చెందుటకు
సేవకులందరినిచ్చె
|| భక్తులారా ||

5. మన పక్షమున తానే పోరాడి
సైతానును ఓడించె
ఇంతవరకును ఆదుకొనెనుగా
తన మహాత్మ్యము జూపె
|| భక్తులారా ||

6. ఈ భువియందు జీవించుకాలము
బ్రతికెదము ప్రభుకొరకే
మనమాయన కర్పించుకొనెదము
ఆయన ఆశయమదియే
|| భక్తులారా ||

7. కొంచెము కాలమే మిగిలి యున్నది
ప్రభువును సంధించుటకై
గనుక మనము నడచుకొనెదము
ప్రభు మార్గముల యందు
|| భక్తులారా ||