స్తోత్రించెదము దైవకుమారుని

“నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను.” కీర్తన Psalm 40:2

పల్లవి : స్తోత్రించెదము దైవకుమారుని – నూతన జీవముతో
నిరంతరము మారని రాజును – ఘనంబు చేయుదము

1. యేసు మా రక్షకుడు – కల్మషము లేనివాడు
సమస్తమును కలిగిన యేసు ప్రభునకే హల్లెలూయ
|| స్తోత్రించెదము ||

2. భయంకరమైన భీతిని గొల్పెడు – జిగట ఊబినుండి
బలమైన హస్తముతో నన్ను ఎత్తి – బండపై స్థిరపరచెను
|| స్తోత్రించెదము ||

3. కనుపాపగ నను కాయు ప్రభుండు – కునుకడు నిద్రించడు
తనచేతిలో ననుచెక్కిన ప్రభువును చేరి స్తుతించెదము
|| స్తోత్రించెదము ||

4. తల్లిదండ్రియు యెడబాసినను – విడువక కాయును
ఎల్లప్పుడు నేను భజియించెదను – వల్లభుడేసు ప్రభున్
|| స్తోత్రించెదము ||

5. ఆత్మీయ పోరాటమునకు ప్రభువు – ఆత్మశక్తినిచ్చెన్
స్తుతియు నీకే ఘనతయు నీకే – యుగయుగములలోన
|| స్తోత్రించెదము ||

హల్లేలూయ పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్

“నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకుకాలమంతయు నా దేవుని కీర్తించెదను.” కీర్తన Psalm 146:2

పల్లవి: హల్లేలూయ పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్
అన్ని వేళల యందున నిన్ను పూజించి కీర్తింతును
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్

1. వాగ్ధానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే
నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే
ప్రభువా – నిన్ను నే కొనియాడెదన్

2. నాదు శత్రువులను – పడద్రోయు వాడవు నీవే
మహా సామార్థ్యుడవు – నా రక్షణ శృంగము నీవే
ప్రభువా – నిన్ను నే కొనియాడెదన్

3. ఎందరు నిను చూచిరో – వారికి వెలుగు కలిగెన్
ప్రభువా నే వేలుగొందితిన్ – నా జీవంపు జ్యోతివి నీవే
ప్రభువా – నిన్ను నే కొనియాడెదన్

4. భయమును పారద్రోలి – అభయము నిచ్చితివి
ఎబినేజరు నీవై ప్రభు – నన్ను సంరక్షించుచుంటివి
ప్రభువా – నిన్ను నే కొనియాడెదన్

5. కష్టములన్నింటిని ప్రియముగా భరియింతును
నీ కొరకే జీవింతును నా జీవంపు దాతవు నీవే
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్

6. ఈ జీవిత యాత్రలో – ఏమి సంభవించిన
మహిమా నీకే ఓ ప్రభూ – ఇదియే నా దీన ప్రార్థనా
ప్రభువా – నిన్ను నే కొనియాడెదన్