ఓ ప్రేమగల యేసు – ప్రేమించినావు మమ్ము

“మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక ఆమేన్‌.” ప్రకటన Revelation 1:6

పల్లవి : ఓ ప్రేమగల యేసు – ప్రేమించినావు మమ్ము
స్మరించుచు స్తుతింతున్ – రక్షణ నిచ్చినావు
1. అద్భుత యాగమందు – అందరికై బలియై
అందరి పాపములకు – ప్రాయశ్చిత్తమైతివి
|| ఓ ప్రేమగల ||

2. దాసులమై మేముండ – మోషేను పంపితివి
చేసితివి స్వతంత్రులుగా – నీ బాహుబలము తోడ
|| ఓ ప్రేమగల ||

3. క్షమాపణానందముతో – సాగింపచేసి మమ్ము
యాత్రలో మాకు తోడై – విజయము నిచ్చితివి
|| ఓ ప్రేమగల ||

4. ఎడారి అడవిలోన – ఊటల నదులు నడిపి
ఎండిన నేలనంత – పచ్చిక బయలు చేసెన్
|| ఓ ప్రేమగల ||

5. బాబెలు నుండి మమ్ము – విడిపించితివి నీవు
బంధకముల తెంచి – తప్పు బోధ బాపినావు
|| ఓ ప్రేమగల ||

6. సహవాసమిచ్చి సంఘ – అంగముల జేసినావు
సాక్షులను చేసి మమ్ము – శత్రువుల సిగ్గుపరచె
|| ఓ ప్రేమగల ||

7. మహా ప్రేమ గల యేసు – మాకై చేసితివన్ని
ఘనపరతు హల్లెలూయ – ఈ గొప్ప రక్షణ కొరకు
|| ఓ ప్రేమగల ||

సహోదరులు ఐక్యత కల్గి వసించుట

“సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!” కీర్తన Psalm 133

పల్లవి : సహోదరులు ఐక్యత కల్గి వసించుట
ఎంత మేలు ఎంత మనోహరముగా నుండును

1. అది అహరోను తలపై పోయబడియు
క్రిందికి గడ్డముపై కారి – నట్టులుండును
|| సహోదరులు ||

2. అంగీల అంచు వరకును దిగజారిన
పరిమళ తైలమువలె – నదియుండును
|| సహోదరులు ||

3. సీయోను కొండ మీదికి – దిగివచ్చునట్టి
హెర్మోను మంచువలె నైక్యత యుండును
|| సహోదరులు ||

4. ఆశీర్వాదమును శాశ్వత జీవము నచ్చట
యుండవలెనని యెహోవా సెలవిచ్చెను
|| సహోదరులు ||