నా శ్రమలో నేను యెహోవాకు మొఱలిడితిని

“నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని. ఆయన నాకు ఉత్తరమిచ్చెను.” కీర్తన Psalm 120

పల్లవి : నా శ్రమలో నేను యెహోవాకు మొఱలిడితిని

1. నాకాయన ఉత్తరమిచ్చెన్ – అబద్ధమాడు వారి నుండి
యెహోవా నా ప్రాణమును విడిపించుము
|| నా శ్రమలో ||

2. మోసకరమగు నాలుకా – ఆయన నీకేమి చేయును?
తంగేడు నిప్పుల బాణముల నీపై వేయును
|| నా శ్రమలో ||

3. అయ్యో నేను మెషెకులో – పరదేశినై యున్నాను
కేదారు గుడారముల యొద్ద కాపురమున్నాను
|| నా శ్రమలో ||

4. కలహప్రియుని యొద్ద – చిరకాలము నివసించితిని
నేను కోరునది సమాధానమే
|| నా శ్రమలో ||

5. అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు
యుద్ధమునకు సిద్ధము అయ్యెదరు
|| నా శ్రమలో ||

యెహోవా నీ యొక్క మాట చొప్పున

“నేను నీ ఆజ్ఞలయందు నమ్మిక యుంచియున్నాను. మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము. శ్రమకలుగక మునుపు నేను త్రోవ విడిచితిని. ఇప్పుడు నీ వాక్యము ననుసరించి నడుచుకొనుచున్నాను.” కీర్తన Psalm 119:65-72

పల్లవి : యెహోవా నీ యొక్క మాట చొప్పున
నీ దాసునికి మేలు చేసియున్నావు

1. మంచి వివేచన మంచి జ్ఞానమునకు – కర్త నీవే నాకు బోధ చేయుము
నీ యాజ్ఞలందు నమ్మిక నుంచితిని
|| యెహోవా ||

2. నాకు శ్రమ కలుగక మునుపు – నా దేవా నేను త్రోవ వీడితిని
నేడు నీ మాట నెరవేర్చు చున్నాను
|| యెహోవా ||

3. దేవా నీవు దయగలవాడవు – దేవా నీవు మేలు చేయుచున్నావు
నీ కట్టడల నాకు బోధించుము
|| యెహోవా ||

4. గర్విష్ఠులు నాకు విరోధముగా – కల్పించుదురెన్నో అబద్ధములు
నీ యుపదేశము లనుసరింతును
|| యెహోవా ||

5. వారి హృదయములు క్రొవ్వువలె – చాల మందముగానై యున్నవి
.ఆజ్ఞలలో ఆనందించుచున్నాను
|| యెహోవా ||

6. దేవా నేను నీ కట్టడలను – నేర్చుకొనునట్లు శ్రమల నొంది
యుండుట నాకు యెంతో మేలాయెను
|| యెహోవా ||

7. వేలాది వెండి నాణెముల కంటె – వేలాది బంగారు నాణెముల కంటె
నీ విచ్చిన ఆజ్ఞలు నాకు మేలు
|| యెహోవా ||