దేవా నా ఆర్తధ్వని

దేవా నా ఆర్తధ్వని వినవా నేనేల దూరమైతిని – కృప చూపవా నీ దరికి చేర్చుకొనవా గాలివాన హోరులో – గమ్యమెటో కానరాక గురియైన నిను చేర – పరితపించుచున్నాను ఆదరణయైనను- ఆరోగ్యమైనను – ఆనందమైనను నీవేగదా|| దేవా || అంతరంగ సమరములో – ఆశలెన్నో విఫలముకాగ శరణుకోర నినుచేర – తల్లుడిల్లుచున్నాను ఆధారమైనను – ఆశ్రయమైనను – ఆరాధనైనను నీవేగదా|| దేవా ||

అదిగదిగో పరలోకము

అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే
వధువు సంఘము – వరుణి వలే పరిపూర్ణ
సౌందర్యమును ధరించుకున్నది (2)

అల్ఫా ఒమేగ యైన  నా ప్రాణ ప్రియునికి
నిలువెళ్ల నివేదించి మైమరతునే (2)
నా యేసు రాజుతో లయము కాని రాజ్యములో