ఆకాశంలో చూడు ఒక వింత తారక

ఆకాశంలో చూడు ఒక వింత తారక
వెలుగులు చిమ్మెను క్రీస్తు జన్మచాటగా “2”
సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ
ఆయన కిష్టులైన వారందరికి భూవిపైన సమాదానము
Happy happy happy Christmas – merry merry merry Christmas “2”

1. పరిశుద్ద ఆత్మవలన – కన్య మరియ గర్బమందున
లోక పాపాలు మోయు దేవుని గొర్రెపిల్లగా
జన్మించెను ధర పులకించగా – సర్వలోకము పరవశించగా “2”

2. గాబ్రియేలు ధూత తెల్పెను – యేసు వార్త గొల్లలకు
తార తెలిపే మార్గమున – తూర్పు దేశ జ్ఞానులకు
బంగారు సాంబ్రాణి బొళమును కానుక లర్పించిరి
పండితులు పామరులు ఎవ్వరికైనా యెసే నిజమైన దేవుడు “2”

ఆకాశం వెలిగింది రాత్రి వేళలో

ఆకాశం వెలిగింది రాత్రి వేళలో
భూలోకం నిండింది శాంతి సంతోషం
పరలోకం విరిసింది గాన ప్రతిగానం (2)
సర్వోన్నతమైన స్థలములలో
ఘన దేవునికే మహిమా
ఆయన కిష్టులైన మనుజులకు
భూమ్మీద సమాధానము
కలుగునుగాక కలుగునుగాక హల్లెలూయాని (2)

1) పరలోక నాధుండు – లోకాన్ని ప్రేమించి
పరసుతుడై పుట్టాడు – మరియమ్మ గర్భామందున
ధరపాపి రక్షింపన్ నరరూప దాల్చాడు(2)(ఆకాశం)

2) పొలమందు కాపరులు రాత్రివేళయందు
చలియందు తమ మందను కాపుకాయుచు నుండగ
ఎరిగించె శుభవార్త దూత గొల్లలకు (2)(ఆకాశం)

3) చూచారు ఘగనానా – ఒక తార జ్ఞానులు
చేరారు ఆ తార వెంట
బెత్లెహేము గ్రామమున్ (2)
గాచారు ప్రభురాజున్ మ్రొక్కికాంతులతో (2) (ఆకాశం)

ఆకాశంలో కొత్త చుక్క పుట్టింది

ఆకాశంలో కొత్త చుక్క పుట్టింది
వింత వింత కాంతులు పంచిపెట్టింది

1. ప్రజలందరికీ మంచి వార్త తెచ్చింది
లోకరక్షకుని జన్మ చాటి చెప్పింది

2. జ్ఞానులకు సరియైన దారి చూపింది
బాలుడైన యేసురాజు చెంత చేర్చింది

ఆఆఆ… పాటలు పాడుదము

ఆఆఆ… పాటలు పాడుదము
ఆఆఆ… నాట్యము చేయుదము (2)
ప్రజలందరికి ప్రభువుద్భవించెను పండుగ చేయుదము (2) ..ఆఆఆ..

1. కాలము సంపూర్ణమాయెను – లేఖనములు నెరవేరెను (2)
కన్య మరియ గర్భమున – క్రీస్తు యేసు జన్మించెను (2) ..ఆఆఆ..

2. సర్వోన్నతుని కుమారుడు – సమాధానమున కధిపతియు (2)
సర్వజనుల రక్షకుడు సతతం స్తోత్రార్హుడు (2) …ఆఆఆఆ…

aa raatrilo ningilo oka taara

ఆ రాత్రిలో నింగిలో ఒక తార – గొప్ప తేజముతో ప్రభవించెను ఆ రేయి
జ్ఞానులు కనుగొనిరి ఓర్పుతో ఆ తారను వెంబడించి చేరెను బేత్లెహేముకు
1. ఆ కాలములో ఉన్న జ్ఞానులు – ఖగోళ వింతను వీక్షించిరి
ఏదో జరిగెనని ఈ లోకంలో – అన్వేషించుచు చేరెను బెత్లేహెం
యూదుల రాజైన యేసుక్రీస్తును – దర్శించి పూజించి ఆరాధించిరి
బంగారం సాంబ్రాణి బోళమునర్పించిరి
2. ఆ కాలములో ఉన్న గొల్లలు – రాత్రిజామున మందను కాయుచుండగా
దేవుని దూతోకటి తెలిపెను శుభవార్త – రక్షకుడేసుని చూచిరి గొల్లలు
లోక రక్షకుడు యేసు క్రీస్తును- కనులారా వీక్షించి సంతోషించిరి
చూచినవి అందరికి చాటించిరి
3. ఆ కాలములో దూత గణములు – పరలోకమునుండి భువికేతెంచుచు
సర్వోన్నతమైన స్థలములలో నేడు – దేవునికి మహిమ కలుగును గాక
ఆయనకిష్టులైన మనుష్యులకు భువిపై – సమాధానము అనుచు దూతలు పాడిరి
గొర్రెల కాపరులు త్వరపడి వెళ్లిరి – బేత్లెహేము గ్రామములో – పశువుల పాకలో
కనులారా బాలుడను – చూచిరి గొల్లలు


aa raatrilo ningilo oka taara – goppa tejamutho prabhavinchenu aa reyi
jnaanulu kanugoniri orputho aa taaranu vembadinchi cherenu bethlehemuku
1. aa kaalamulo unna jnanulu – khagolla vintanu veekshinchiri
edo jarigenani ee lokamlo – anveshinchuchu cherenu bethlehem
yoodula raajaina yesukreestunu – darsinchi poojinchi aaraadhinchiri
2. aa kaalamulo unna gollalu – raatrijaamuna mandanu kaayuchundagaa
devuni doothokati telipenu subhavaartha – kashakudesuni choochiri gollalu
loka rakshakudu yesu kreestunu – kanulaaraa veekshinchi santhoshinchiri
choochinavi andariki chaatinchiri
3. aa kaalamulo dootha gannamulu – paralokamunundi bhuviketenchenu
sarvonnathamaina stalamulalo nedu – devuniki mahima kalugunu gaaka
aayanakishtulaina manushyulaku bhuvipai – samaadhaanamu anuchu doothalu paadiri
gorrela kaaparulu twarapadi velliri – bethlehemu graamamulo – pasuvula paakalo
kanulaaraa baaludanu – choochiri gollalu