అంబరవీధిలో తారక – వెలసెను తూర్పున వింతగా

అంబరవీధిలో తారక – వెలసెను తూర్పున వింతగా
యూదుల రాజుని పుట్టుక – లోకానికి ప్రకటించగా

1. జ్ఞానులు తారను గమనించి – బెత్లెహేమునకు పయనించి
శిశువును గని సంతోషించి – మ్రొక్కిరి కానుకలర్పించి

2. అంధకారమును తొలగించి – హృదయపు దీపము వెలిగించి
వాక్యమే ఇల నిజతారకలా –

అంబరాన్ని దాటే సంబరాలు నేడు

అంబరాన్ని దాటే సంబరాలు నేడు
నింగిలో చుక్క బుట్టి వచ్చింది మనకు తోడు (2)
రండయ్యో రండి రండి దావీదు పురముకు (2)
రారాజు పుట్టి ఇల పిలిచెను కొలువుకు (2) ||అంబరాన్ని||

దేవుడు ఎంతగానో ప్రేమించి లోకము
ఏకైక తనయుని పంపెను ఈ దినము (2)
పశువుల పాకలో ఒదిగేను శిశువుగా (2)
అవతరించే నేడు లోక రక్షకునిగా (2) ||రండయ్యో||

దేవాది దేవుడు మనిషిగా మారిన వేళ
శాపాలు పాపాలు రద్దయిన శుభవేళ (2)
లోకాల కారకుడు లోకమున పుట్టెను (2)
మనిషి మరణము ఆయువు తీరెను (2) ||రండయ్యో||

ambaraanni daate sambaraalu nedu
ningilo chukka butti vachchindi manaku thodu (2)
randayyo randi randi daaveedu puramuku (2)
raaraaju putti ila pilichenu koluvuku (2) ||ambaraanni||

devudu enthagaano preminchi lokamu
ekaika thanayuni pampenu ee dinamu (2)
pashuvula paakalo odigenu shishuvugaa (2)
avatharinche nedu loka rakshakunigaa (2) ||randayyo||

devaadi devudu manishigaa maarina vela
shaapaalu paapaalu raddaayina shubhavela (2)
lokaala kaarakudu lokamunu puttenu (2)
manishi maranamu aayuvu theerenu (2) ||randayyo||

అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల

అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల
యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని

1. ప్రవచనాలు నెరవేరాయి శ్రమదినాలు ఇకపోయాయి (2),
విడుదల ప్రకటించే శిక్షను తప్పించే (2),

2. దివిజనాలు సమకురాయి ఘనస్వరాలు వినిపించాయి (2),
పరముకు నడిపించే మార్గము చూపించే (2),

3. సుమవనాలు పులకించాయి పరిమళాలు వెదజల్లాయి (2),
ఇలలో నశియించే జనులను ప్రేమించే (2),

అంబరాన నడిచేను నక్షత్రం

అంబరాన నడిచేను నక్షత్రం ఆనందబరితులు చేసెను
స్తోత్రం , సంబరాలు చేయగ ప్రతి గోత్రం
యేసు రాజుకే స్తుతి స్తోత్రం “సర్వ జనులకు”

1. మనవాళిని రక్షింపను , పాప చీకటి తొలగింపను
వ్యాది భాదలు తొలగింపను,నీతి సూర్యుడు జనియించేను “Happy” “అంబరాన”

2. పేదరికము తొలగింపను , శపమంత తొలగింపను
చింతలన్ని తొలగింపను , శ్రీమంతుడేసు జనియించేను “Happy” “అంబరాన”

3. శత్రు భయము తొలగింపను మరణ భయము తొలగింపను
కన్నిరంత తొలగింపను ఇమ్మనుయెలు జనియించెను “Happy” “అంబరాన”

అంబర వీధిలో – సంబరం గాంచిరి

అంబర వీధిలో – సంబరం గాంచిరి
కొందరు గొల్లలు – తొందరగ వెళ్లిరి//2//

1. బెత్లెమను యూరిలో – సత్రమున శాలలో
పశువుల తొట్టిలో – ప్రభు యేసుడు పుట్టెను//2//

2. తూర్పుతారను గాంచిరి – మరిజ్ఞానులు వచ్చిరి
తమ కానుకల్ తెచ్చిరి – మన యేసు కర్పించిరి//2//

3. ఇక చింతను వీడుము – గురి యొద్దకు చూడుము
మరి అంతము రానగున్ – యేసు చెంతకు చేరుము//2//