ఆరాధన – ఆరాధన క్రిస్మస్ ఆరాధన

ఆరాధన – ఆరాధన క్రిస్మస్ ఆరాధన (2)
యేసయ్యా జన్మదిన క్రిస్మస్ ఆరాధన (2)
అప:- ఉల్లాసమే ఉత్సహమే సంతోష ఆనందమే (2)

1) కనిపించకుండా లేవు మాటలతో చెప్పలేవు
హృదయ శుద్ధిగలవారే ప్రభుని చూచెదరండి
వర్ణింపతరమా వివరింపతరమా ఈ మహ ఆనందము (2)( ఉల్లా)

2) ఆచారపండగ కాదు వారసత్వ పండుగ కాదు
పుట్టుకతో మేము క్రైస్తవులం అన్న భావన ఉండరాదు
మారుమనస్సు పొందితేనే దొరెకెను ఈ తరం (2)(ఉల్లా)

3) దేశమేదైన గాని యేసే నిత్యజీవమని
భావన ప్రజలందరు భక్తి ఆశక్తిగలిగి
కారణ జన్ముడు ఘనుడు యేసుకు స్తోత్రం చెల్లించెదం ( ఉల్లా)

ఆనందం ఆనందం – బెత్లహేమూ పురములో ఆనందం

ఆనందం ఆనందం – బెత్లహేమూ పురములో ఆనందం
సంతోషం సంతోషం మన అందరి–మనసులో సంతోషం “2”
హ్యాపీ హ్యాపీ క్రిస్టమస్ – క్రీస్తు నేడు పుట్టెను హల్లెలుయ “2”

1. గొర్రెల కాపరులభయము తొలిగింది – యేసుని జన్మతో లోకం వెలిగింది “2”
యేసు పుట్టెను భయము తొలగెను – జనులందరికి రక్షణ కలిగెన్ “2”

2. పాప బంధకాలలోవున్నా నిన్ను – విడిపించుటకు యెసయ్యా జన్మించే
నేడే వేడుకో ఆ ప్రభు యేసుని – రక్షణ నీకు కావాలని “2”