ఆకాశాన వెలసింది తార

ఆకాశాన వెలసింది తార
ఆ తారకర్థం శ్రీ యేసు జననం (2)
ఆ నిశీధి రాత్రి లోకానికే దివ్యరాత్రి (2)

1. దివిలోన దూతల్ స్తుతి గీతి పాడెన్
నీ దివ్య నామంబు మహిమా (2)
మేమంత పాడి నిను కీర్తింతుము (2)
నీ ప్రేమ సందేశమివ్వా
అ.ప.: ఆ నిశీధి రాత్రి లోకానికే దివ్యరాత్రి (2) ..ఆకాశా

2. అపరంజి బోళం సాంబ్రాణులన్ని
కానుకలిచ్చారు జ్ఞానుల్ (2)
నవకాంతులన్నీ లోకాన వెలిగే (2)
పాపాలు పరిహారమాయే
ఆ నిశీధి రాత్రి లోకానికే దివ్యరాత్రి (2)

ఆకాశగగనాన మెరిసింది తారక

ఆకాశగగనాన మెరిసింది తారక
యేసయ్య ఉదయించాడనీ ” 2 “
ఆయనే లోక రక్షకుడు
ఆయనే పాప విమోచకుడు ” 2 “
బంగారు బోళము సాంబ్రానులను
అర్పించేదం హ్యాపీ క్రిస్మస్
గొల్లలు జ్ఞానులు ఏతెంచి వచ్చిరి
చేద్దామా మేరి క్రిస్మస్ ” 2 “
*” ఆకాశగగనాన “*

*1 )* బెత్లహేము నగరాన
కన్య మరియ గర్భాన
పశులపాకలో పవలించాడు యేసయ్య ” 2 “
వేలాది దూతల గాణప్రతి గాణములతో
కోట్లాది దూతల సైన్య సమూహముతో ” 2 “
నాకోసమే భువికేతెంచెను
నజరేతు వానిగా ” 2 “
*” ఆకాశగగనాన “*

*2 )* గాబ్రియేలు దేవ దూత
తెలిపెను ఒక శుభవార్త
సర్వ మానవాళికి సంతోషము కలుగునని “2”
రారండి చేద్దాము ఉత్సాహ ఆర్భాటములతో
మనసారా కొనియాడి కీర్తించి స్తుతియించెదము ” 2 “
మన కోసమే భువికేతెంచెను నజరేతు వానిగా
*” ఆకాశగగనాన “*