అరుణకాంతి కిరణమై-కరుణ చూపి ధరణిపై

అరుణకాంతి కిరణమై-కరుణ చూపి ధరణిపై
నరుని రూపు దాల్చెను-పరమదేవ తనయుడు
అదే అదే క్రిస్మస్ – హ్యాపీ క్రిస్మస్ (2) ఇదే ఇదే క్రిస్మస్ – మెరీ క్రిస్మస్

1. యజ్ఞ యాగాదులు-బలికర్మ కాండలు
దోషంబులు కడుగలేవు-దోషుల రక్షింపలేవు (2)
పరిశుద్ధుని రక్తమునందే-పాపులకిల ముక్తి కలుగును
అందుకే అందుకే ..అరుణ

2. పుణ్యకార్యంబులు – మరి తీర్థయాత్రలు
మోక్షంబును చేర్చలేవు-మనశ్శాంతిని కూర్చలేవు
పరిశుద్ధుని రక్తమునందే-పాపులకిల ముక్తి కలుగును
అందుకే అందుకే ..అరుణ

అనుక్షణం నీ కృపలో ప్రతీదినం నీ సన్నిధిలో

అనుక్షణం నీ కృపలో ప్రతీదినం నీ సన్నిధిలో
నా జీవితం దాచినావు ‘2’
విడువని కృపతో ప్రేమించే నా యేసయ్య
ఎడబాయదు నీ అనురాగము ‘2’

శాశ్వత జీవము నను చేర్చుటకు
ఉన్నత మహిమ విడచితివి ‘2’
నా రక్షణకై నీ ప్రాణమును త్యాగము చేసావు ‘2’
దాసుని రూపము దాల్చిన దయగల యేసయ్య
సాగిలపడి నిను సేవించెద ‘2’

నా శోధనలో కలవరపడుచు
వేదనతో నిండే నా హృదయం’2′
నీ కనికరమే నను చేరదీసి ఆదరించినది ‘2’
ఆధారం ఆశ్రయం నీవే యేసయ్య
నను విడిపించి దీవించువాడవు ‘2’