చుక్కను చూసి వచ్చినాము

చుక్కను చూసి వచ్చినాము
చక్కని యేసుని చూసినాము
తెచ్చిన కానుకలిచ్చినాము
సాగిలపడి మ్రొక్కినాము “2”
శ్రీమంతుడొచ్చడని ఓ
జనులారా
జగమంత చాటెదము
పరిశుద్ధుడొచ్చడని ఓ ప్రియులారా
ప్రభు చెంత చేరెదము “2”

1) ప్రవక్తల నోటి నుండి పలికిన మాటలకు
ప్రభువైన యేసు రుజువుగా వచ్చినాడు “2”
చూసిన వారిని ఆశ్చర్యపరచి ” 2 “
కన్యకు పుట్టిన పరిశుద్ధుడోయమ్మా”2″
శ్రీమంతుడొచ్చడని ఓ జనులారా
జగమంత చాటెదము
పరిశుద్ధుడొచ్చడని ఓ ప్రియులారా
ప్రభు చెంత చేరెదము “2”

2) పసిబాలుడైన క్రీస్తేసు రాజు
పశువుల పాకలో పవళించినాడు ” 2′
చూసిన వారికి చూడముచ్చట గొలిపి”2″
చూపులకెల్లా అతీసుందరుడోయమ్మా”2″
శ్రీమంతుడొచ్చడని ఓ జనులారా
జగమంత చాటెదము
పరిశుద్ధుడొచ్చడని ఓ ప్రియులారా
ప్రభు చెంత చేరెదము “2”
చుక్కను చూసి వచ్చినాము
చక్కని యేసుని చూసినాము
తెచ్చిన కానుకలిచ్చినాము
సాగిలపడి మ్రొక్కినాము “2”
శ్రీమంతుడొచ్చడని ఓ
జనులారా
జగమంత చాటెదము
పరిశుద్ధుడొచ్చడని ఓ ప్రియులారా
ప్రభు చెంత చేరెదము “4”

చలి రాతిరి ఎదురు చూసే

చలి రాతిరి ఎదురు చూసే
తూరుపేమో చుక్క చూపే
గొల్లలేమో పరుగునొచ్చె
దూతలేమో పొగడ వచ్చె
పుట్టాడు పుట్టాడురో రారాజు
మెస్సయ్యా పుట్టాడురో మన కోసం (2)
పశుల పాకలో పరమాత్ముడు
సల్లని సూపులోడు సక్కనోడు
ఆకాశమంత మనసున్నోడు
నీవెట్టివాడవైనా నెట్టివేయడు (2)
సంబరాలు సంబరాలురో
మన బ్రతుకుల్లో సంబరాలురో (2) ||చలి||
చింతలెన్ని ఉన్నా చెంత చేరి
చేరదీయు వాడు ప్రేమగల్లవాడు
ఎవరు మరచినా నిన్ను మరవనన్న
మన దేవుడు గొప్ప గొప్పవాడు (2)
సంబరాలు సంబరాలురో
మన బ్రతుకుల్లో సంబరాలురో (2) ||చలి||

చింత లేదిక యేసు పుట్టెను

పల్లవి:
చింత లేదిక యేసు పుట్టెను – వింతగను బెత్లెహేమందున

చెంతజేరను రండి సర్వజనంగమా – సంతస మొందుమా
…చింత…

1.
దూత తెల్పెను గొల్లలకు శుభవార్త నా దివసంబు వింతగా

ఖ్యాతి మీరగ వారు యేసుని గాంచిరి – స్తుతు లొనరించిరి
…చింత…

2.
చుక్కగనుగొని జ్ఞానులెంతో మక్కువతో నా ప్రభుని గనుగొని

చక్కగా బెత్లెహెము పురమున జొచ్చిరి – కానుక లిచ్చిరి
…చింత…

3.
కన్య గర్భమునందు బుట్టెను – కరుణ గల రక్షకుడు క్రీస్తుడు

ధన్యులగుటకు రండి వేగమే దీనులై – సర్వమాన్యులై
…చింత…

4.
పాప మెల్లను పరిహరింపను – పరమ రక్షకుడవతరించెను

దాపు జేరిన వారి కీడు గడు భాగ్యము – మోక్షభాగ్యము

క్రిస్ట్మస్ మాషప్ నజరేతు పట్నాన నగుమల్లె

క్రిస్ట్మస్ మాషప్ నజరేతు పట్నాన నగుమల్లె

నజరేతు పట్నాన నగుమల్లె దరని లొ
యొసేపు మరియమ్మ నగుమల్లె దరని లొ
హల్లెలుయ (x4)

మేము వెల్లి చూచినాము స్వామి యెసు నాదుని
ప్రెమ మ్రొక్కి వచినాము మామనమ్బు లల్లరగ
బెతలెము పురములొన బీద కన్య మరియకు
పేదగ సురూపు దాల్చి వెలసె పశుల పాకలొ

పేద వడ్ల వారి కన్య మరియమ్మ
ప్రెమ గల యేసు తల్లి మరియమ్మ
ప్రెమ గల్ల యెసు తల్లి
పెరెల్లిన దేవ దేవుడె యెసయ్య
ప్రెమ గల అవతారం
స్వర్గ ద్వరాలు తెరిచిరి యెసయ్య
స్వర్గ రాజు పుట్ట గనె యెసయ్య
స్వర్గ రాజు పుట్ట గనె
సరుగున దూతల్ వచిరి యెసయ్య
చక్కని పాటల్ పాడిరి

నువు బొయె దారి లొ యెరుశలెము
గుడి కాడ అచం మల్లె పూల తొట యెసయ్య
దొడ్డు దొడ్డు బైబిలు దొసిట్లొ పెట్టుకొని
దొరొల్లె బయిలెల్లి నాడె యెసయ్య

రాజులకు రాజు పుట్టన్నయ్య
రా రె చూడ మనం ఎల్లుదం అన్నయ్య
తారన్ జూచి తూర్పు గ్యనుల్ అన్నయ్య
తరలి నారె బెత్లహెమ్ అన్నయ్య

పద ర పొదాము రన్న
శ్రి యెసుని చూడ
పద ర పొదము రన్న
శ్రి యెసన్న నట లొక రక్షకుడట
శ్రి యెసన్న నట లొక రక్షకుడట
లొకుల్ అందరికయ్యొ ఎక రక్షకుడట
లొకుల్ అందరికయ్యొ ఎక రక్షకుడట
పద ర హెయ్ పద ర హెయ్
పద ర పొదము రన్న
శ్రి యెసుని చూడ
పద ర పొదాము రన్న

రా రండి జనులారా

హుక్ – నా నా నా నా నా….

1- రా రండి జనులారా
మనం బేతలెం పోదామా
యుద్ధుల రాజు జన్మించినాడు
వే వేగ వెల్లుధామా
జన్మ తరియింప తారలుధామా

సర్వోన్నత స్థలములలో నా
దేవునికి మహిమా ఆమెన్ ఆమెన్
ఆయనకు ఇష్టులైన వారికి సమాధానమెల్లప్పుడు

2- పుట్టాడండోయ్ పుట్టాడండోయ్ మన యేసు రక్షకుడు పుట్టాడండోయ్
యేసు మనల ప్రేమిస్తు పుట్టాడండోయ్
మన పాపము కోరకు పుట్టాడండోయ్
యేసుని చేర్చుకో రక్షకునిగా ఎంచుకొ

3- పాడుడి గీతములు హల్లెలుయ
మీటుడి నాధములు హల్లెలుయా
పాప రహితుడు హల్లెలుయ
పాప వినాశకుడు హల్లెలుయ

ఆకాశమున వింత గొలిపెను
అద్బుత తారను గాంచిరి
పయనించిరి జ్ఞానులు ప్రభు జాడకు

4- రాజులకు రాజు యేసయ్య
పశువుల పాకలో పుట్టాడయ్య రాజులకు రాజు యేసయ్య
నీ కొరకు నా కొరకు పుట్టాడయ్య

గొల్లలు జ్ఞానులు వచ్చిరయ్యా
దూతలు పాటలు పాడిరయ్యా (2)
ఈ వార్తను చాటింప పొదామయ్య (2)

పోదాము ఆహా పోదాము.
పద పోదాము మనము పోదాము

5-పోదాము పోదాము పయనమౌదాము శుభవార్త చెప్పా పోదాము (2)
అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఎక్కడ పోదాము?శుభ వార్త చదివి చెప్ప సాగిపోదాము (2)

6- శ్రీ యేసన్న నట రాజులకు రాజు అట
రాజులందరికయ్యో ఒక్కడే రాజు అట

పద రా హే పదా రే హే పద రా పోధాము
రన్న
శ్రీ యేసుని చూడా పద రా పోధాము
రానా