అందాల బాలుడు ఉదయించినాడు

అందాల బాలుడు ఉదయించినాడు
లోకాలు వెలిగించు నీతి సూరీడు (2)
రండయ్యో మన కొరకు రారాజు పుట్టెను
ప్రేమను పంచేటి రక్షణను తెచ్చెను (2) ||అందాల||

భీతిల్లి పోయాము ఆ వెలుగునే జూసి
ఎన్నడూ ఎరుగని తేజస్సునే గాంచి (2)
గొల్లలము మేము కల్లలు ఎరుగము (2)
కళ్లారా జూసాము తేజోమయుని మోము (2) ||రండయ్యో||

తూరుపు జ్ఞానులము వెలిగే తారను జూసి
లెక్కలెన్నో వేసి మాహరాజు-నెతికాము (2)
దారి చూపే తార రారాజునే జేర (2)
మొక్కాము మోకరిల్లి బాలున్ని మనసారా (2) ||రండయ్యో||

తనలోని వెలుగంత పంచేటి పావనుడు
మనలోని పాపమంత తీసేయు రక్షకుడు (2)
చీకట్లు తొలగించ ఉదయించినాడు నేడు (2)
నీ తప్పులెన్ని ఉన్నా మన్నించుతాడు రేడు (2) ||రండయ్యో||

andaala baaludu udayinchinaadu
lokaalu veliginchu neethi sooreedu (2)
randayyo mana koraku raaraaju puttenu
premanu pancheti rakshananu thecchenu (2) ||andaala||

bheethilli poyaamu aa velugune joosi
ennadu erugani thejassune gaanchi (2)
gollalamu memu kallalu erugamu (2)
kallaaraa joosaamu thejomayuni momu (2) ||randayyo||

thoorupu gnaanulamu velige thaaranu joosi
lekkalenno vesi maharaaju-nethikaamu (2)
daari choope thaara raahune jera (2)
mokkaamu mokarilli baalunni manasaaraa (2) ||randayyo||

thanaloni velugantha pancheti paavanudu
manaloni paapamantha theeseyu rakshakudu (2)
cheekatlu tholagincha udayinchinaadu nedu (2)
nee thappulenni unnaa manninchuthaadu redu (2) ||randayyo||

అందాల తారొకటి ఉదయుంచింది

అందాల తారొకటి ఉదయుంచింది
ఆకాశానికి కొత్త కళ తెచ్చింది యేసయ్య
జన్మను ప్రకటించింది జ్ఞానులను దారిలో నడిపించింది
అ.ప: wish you happy christmas
we wish you merry Christmas

1. పొలములో ఉన్న కాపరులకుదేవుని ప్రేమ కనిపించింది
దావీదు పట్టణములో పుట్టిన
రక్షకుని ఆనవాలు తెలియజేసింది

2. పరలోక సైన్యసమూహములు భూలోకమునకు
దిగివచ్చాయు సర్వోన్నత స్థలములలో మహిమని
దేవునికి స్తోత్రములు చెల్లించాయు

3. దేవుని ఎరుగని అన్యులకు తారవలె దారిచూపించాలి
సువర్తమానము ప్రకటించుచు క్రీస్తునకు మహిమను కలిగించాలి