అందాల తార అరుదెన్ఛె నాకై

అందాల తార అరుదెన్ఛె నాకై

పల్లవి: అందాల తార అరుదెంచె నాకై – అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి -అవని చాటుచున్
ఆనందసంద్ర ముప్పోంగెనాలో – అమరకాంతిలో
ఆది దేవుని జూడ – అశింపమనసు – పయనమైతిమి .. అందాల తార..

1. విశ్వాసయాత్ర – దూరమెంతైన – విందుగా దోచెను
వింతైన శాంతి – వర్షంచెనాలో – విజయపధమున
విశ్వాలనేలెడి – దేవకుమారుని – వీక్షించు దీక్షలో
విరజిమ్మె బలము – ప్రవహించె ప్రేమ – విశ్రాంతి నొసగుచున్ .. అందాల తార..

2. యెరూషలేము – రాజనగరిలో – ఏసును వెదకుచు
ఎరిగిన దారి – తొలగిన వేల – ఎదలో క్రంగితి
ఏసయ్యతార – ఎప్పటివోలె – ఎదురాయె త్రోవలో
ఎంతో యబ్బురపడుచు – విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు .. అందాల తార..

3. ప్రభుజన్మస్ధలము – పాకయేగాని పరలోక సౌధమే
బాలునిజూడ – జీవితమెంత – పావనమాయెను
ప్రభుపాదపూజ – దీవెనకాగా – ప్రసరించె పుణ్యము
బ్రతుకె మందిరమాయె – అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన .. అందాల తార..


For More Christian Songs Lyrics
Visit: www.newchristianprayerchurch.org
Youtube : https://www.youtube.com/@Newchristianprayerchurch/



andaru mechchina andaala thaara

అందరు మెచ్చిన అందాల తార
అవనికి తెచ్చెను వెలుగుల మేడ (2)
క్రిస్మస్.. హ్యాపీ క్రిస్మస్
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
క్రిస్మస్.. మెర్రి క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ (2) ||అందరు||

సృష్టికర్తయే మరియ తనయుడై
పశుల పాకలో పరుండినాడు (2)
నీతి జీవితం నీవు కోరగా
నీకై రక్షణ తెచ్చినాడు (2)
నీకై రక్షణ తెచ్చినాడు ||క్రిస్మస్||

ఇంటిని విడిచి తిరిగిన నాకై
ఎదురు చూపులే చూచినాడు (2)
తప్పును తెలిసి తిరిగి రాగా
క్షమియించి కృప చూపినాడు (2)
ఎన్నో వరములు ఇచ్చినాడు ||క్రిస్మస్||

పాత దినములు క్రొత్తవి చేసి
నీలో జీవము నింపుతాడు (2)
కటిక చీకటే వేకువ కాగా
అంబరమందు సంబరమాయే (2)
హృదయమునందు హాయి నేడు ||క్రిస్మస్||

andaru mechchina andaala thaara
avaniki thechchenu velugula meda (2)
christmas.. happy christmas
happy happy christmas
christmas.. merry christmas
merry merry christmas (2) ||andaru||

srushtikarthaye mariya thanayudai
pashula paakalo parundinaadu (2)
neethi jeevitham neevu koragaa
neekai rakshana thechchinaadu (2)
neekai rakshana thechchinaadu ||christmas||

intini vidichi thirigina naakai
eduru choopule choochinaadu (2)
thappunu thelisi thirigi raagaa
kshamiyinchi krupa choopinaadu (2)
enno varamulu ichchinaadu ||christmas||

paatha dinamulu krotthavi chesi
neelo jeevamu nimputhaadu (2)
katika cheekate vekuva kaagaa
ambaramandu sambaramaaye (2)
hrudayamunandu haayi nedu ||christmas||

For More Christian Songs Lyrics
Visit: www.newchristianprayerchurch.org
Youtube : https://www.youtube.com/@Newchristianprayerchurch/