కన్యక గర్భము ధరించుననుమాట ప్రవచనము

కన్యక గర్భము ధరించుననుమాట ప్రవచనము
ఓ కన్యక దానికి అంగీకరించుట సాహసము
జ్ఞానులు తారలు పరిశీలించుట శాస్త్రము
ఆ తార జ్ఞానులకు దారిని చూపుట అద్భుతము
గొఱ్ఱెల కాపరులు పొందిన దర్శనము
దేవదూతల సువార్తమానము
రాజు పన్నిన కపటోపాయము
పసిపిల్లల వధ జరుగుట ఘోరము

తరములు యుగములు ఘనముగ
పలికిన క్రీస్తు జననసుధ
నిశిగల బ్రతుకుల శశికళలొసగిన
రారాజు ఆత్మకథ

1. కలిగినవన్నియు ఆయన లేకుండా కలుగలేదట
అయినా సత్రమున చోటు దొరుకుట సాధ్యపడలేదట
ఆకాశములను పరచిన వానికి ఆయన తనయుడట
పశువుల తొట్టిలో శిశువైపరుండుట ఎంత దీనమట
కాలాతీతుడు కాలవశుడిగా మారిన వైనమట
సత్యము గూర్చి సాక్ష్యమిచ్చుటకు పుట్టినాడట
మన కొరకే శిశువు పుట్టెను అనుమాట ప్రవచనము
ఆ ప్రభువే శిశువై జన్మించడం మన అదృష్టము

వింత వింత ఎంత వింత క్రీస్తు శాంతిసుధ
వింత వింత ఎంతో వింత యేసు కీర్తిప్రధ

2. అంతములేని ఆయన రాజ్యము రక్షణ శృంగమట
రిక్తునిగా మారి శక్తిని విడనాడి నరునిగా పుట్టేనట
సృష్టిని మొత్తం చెక్కినశిల్పి జ్ఞానపుగని ఇచ్చట
వడ్లవానిగా బీదల ఇంటిలో కాలము గడిపెనట
రత్నవర్ణుడు రక్తమివ్వగా దేహము పొందేనట
గొఱ్ఱెపిల్లగా లోకపాపము మోసుకు పోయేనట
ఇమ్మానుయేలని పేరు పెట్టుటయే ప్రవచనము
ఆ దేవుడు మనకు తోడు అని దాని భావము

వింత వింత ఎంత వింత క్రీస్తు శాంతిసుధ
వింత వింత ఎంతో వింత యేసు కీర్తిప్రధ

ఓ సద్భక్తులారా లోక రక్షకుండు

Reference: శిశివును చూచి సాగిలపడి ఆయనను పూజించిరి మత్తయి Matthew 2:11

1. ఓ సద్భక్తులారా లోక రక్షకుండు
బేత్లెహేమందు నేడు జన్మించెన్
రాజాధిరాజు ప్రభువైన యేసు
నమస్కరింప రండి నమస్కరింప రండి
నమస్కరింప రండి యుత్సాహముతో

2. సర్వేశ్వరుండు నరరూపమెత్తి
కన్యకుబుట్టి నేడు వేంచేసెన్
మానవజన్మ మెత్తిన శ్రీ యేసు
నీకు నమస్కరించి నీకు నమస్కరించి
నీకు నమస్కరించి పూజింతుము

3. ఓ దూతలారా యుత్సహించి పాడి
రక్షకుండైన యేసున్ స్తుతించుడి
పరాత్పరుండ నీకు స్తోత్రమంచు
నమస్కరింప రండి నమస్కరింప రండి
నమస్కరింప రండి యుత్సాహముతో

4. యేసు ధ్యానించి నీ పవిత్రజన్మ
మీ వేళ స్తోత్రము నర్పింతుము
అనాది వాక్యమాయె నరరూపు
నమస్కరింప రండి నమస్కరింప రండి
నమస్కరింప రండి యుత్సాహముతో

ఎంతో శుభకరం ప్రభు జననం

ఎంతో శుభకరం ప్రభు జననం
చీకటి బ్రతుకుల అరుణోదయం
అ.ప: విడుదల దొరికెను – శ్రమలిక వెడలెను సంతోషము విరిసెను

1) పరిశుద్దముగా తనపిల్లలుగాఇలలో జీవింపను
మనకై నీతిరాజు మనిషై వెలిసాడు
తన వైభవమును విడిచి దిగినాడు

2) జీవితకాలము లేకుండా భయము దేవుని సేవింపను
సర్వాధికారి తండ్రి కుమారుడయ్యాడు
రక్షణ శృంగమై భువిలో పుట్టాడు.

ఊరుకో నా ప్రాణమా కలత చెందకు

ఊరుకో నా ప్రాణమా కలత చెందకు
ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా
ఎడారి దారిలోన‌‌‌ కన్నీటి లోయలోన
నా పక్ష‌ మందు నిలిచే నా ముందురే నడిచే
నీ శక్తినే చాట నన్నుంచెనే చోట‌
నిన్నెరుగుటే మా ధనం
ఆరాధనే మా ఆయుధం
ఎర్రసముద్రాలు నా ముందు పొర్లుతున్న
ఫరో సైన్యమంతా నా వెనుక తరుముచున్న
నమ్మదగిన దేవుడే నడిపించుచుండగా
నడి మధ్యలో నన్ను విడిచిపెట్టునా
ఇంతవరకు నడిపించిన దాక్షిణ్యపూర్ణుడు
అన్యాయము చేయుట అసంభవమేగా
వాగ్దానమిచ్చిన సర్వశక్తిమంతుడా
దుష్కార్యము చేయుట అసంభవమేగా
అవరోధాలెన్నో నాచుట్టూ అలుముకున్న
అవరోధాల్లోనే అవకాశాలను దాచేగా
యెహోవా సెలవిచ్చిన ఒక్కమాట యైనను
చరిత్రలో యెన్నటికి తప్పి ఉండలేదుగా

ఊరు వాడ సంబరమేనంట

ఊరు వాడ సంబరమేనంట
గుండెలనిండా సంతోషమంట యేసురాజు
పుట్టేనంట పాపుల రక్షకుడుదయించేనంట
సంబరం సంబరం సంబరమేనంట
యుదయా దేశమంట బేత్లెహేము గ్రామమంట
ఎన్నికే లేనిదంట యేసయ్య ఎన్నుకున్నాడంట
దీనురాలైన కన్యమరియకు శిశువుగా జన్మించాడంట
నరులందరిని రక్షించుటకు నరరూపునిగా వచ్చాడంట
తూర్పుదేశపు జ్ఞానులంట యేసుని చూడ వచ్చారంట
బంగారు సాంబ్రాణి బోళమును కానుకగా అర్పించారంట
మందకాచే కాపరులు పరుగు పరుగున వచ్చారంట
పాటలతో నాట్యముతో యేసయ్యను స్తుతియించారంట