idi shubhodayam – kreesthu janmadinam

ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం
ఇది లోక కళ్యాణం
మేరి పుణ్యదినం – (2)

రాజులనేలే రారాజు వెలసె పశువుల పాకలో
పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో
భయము లేదు మనకిలలో
జయము జయము జయమహో ||ఇది||

గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయ భక్తితో
పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో
జయనాదమే ఈ భువిలో
ప్రతిధ్వనించెను ఆ దివిలో ||ఇది||


idi shubhodayam – kreesthu janmadinam
idi loka kalyaanam
mary punyadinam – (2)

raajulanele raaraaju velase pashuvula paakalo
paapula paalita rakshakudu navvenu thalli kougililo
bhayamu ledu manakilalo
jayamu jayamu jayamaho ||idi||

gollalu gnaanulu aanaadu pranamilliri bhaya bhakthitho
pillalu peddalu eenaadu poojinchiri prema geethitho
jayanaadame ee bhuvilo
prathidhwaninchenu aa divilo ||idi||

ఇదే క్రిస్మస్ పండుగరోజు

ఇదే క్రిస్మస్ పండుగరోజు – నేడే శ్రీయేసుని పుట్టిన రోజు
క్రీస్తు ప్రభు నరరూపిగ – ధరకేతెంచిన రోజు ఈ రోజు
ఆహ ఆనందమే – ఆహ ఆశ్చర్యమే – రక్షకుని జననము
భయమేలనే భువియందున – జయరాజు జన్మంచెను (2) (ఇదే)

1) సర్వోన్నతుడు సర్వశక్తుడు
సర్వజనములకు రక్షణ దర్శనమిచ్చెను
పరమానందమే (ఇదే)

2) అన్యజనులకు ఆశ్రయదుర్గము
అంధకారముతో ఆశజ్యోతి (2)
వాత్సల్యముతో వెలుగుగా వచ్చెను
మహదానందమే (ఇదే)

3) ప్రియ కుమారుడు ఇమ్మానుయేలు
మార్గము సత్యము జీవమాయేసే(2)
అక్షయ మార్గము ఆనందింపవచ్చెను
నిత్యమానందమే (ఇదే)

kalam sampoornamainapudu

కాలం సంపూర్ణమైనపుడు యేసయ్య భువికొచ్చెను
తానే మనలను ప్రేమించి రక్షకుడై జన్మించెను
రాజాధి రాజైనను ఇలలో దాసునిగా జీవించెను
సత్యమును స్థాపించుటకు దైవసుతునిగా ఉదయించెను
ఇది ఆశ్చర్యమే – ఇది అద్భుతమే
ఆహా ఆనందమే – హాపీ హ్యాపీ క్రిస్మస్
ఇది ఆశ్చర్యమే – ఇది అద్భుతమే…
ఆహా ఆనందమే – మెర్రి మెర్రి క్రిస్మస్

1. జ్ఞానులు సాగిలపడిరి – మ్రొక్కిరి ప్రభువుల ప్రభువును
అటువలె విశ్వసించుచు – పూజించెదం ప్రభు యేసును
సర్వోన్నతమైన స్థలములలోన – దేవదేవునికే మహిమ
తనకిష్టులైన ప్రజలందరికి – భూమి మీద సమాధానము

2. గొల్లలు దేవుని మాటను – గ్రహియించిరి దూత చెప్పగా
విధేయతే మనకు ముఖ్యము – గ్రహియించుము దేవుని చిత్తము
వాక్యమైన దేవుడు శరీరధారిగా – మన మధ్యలో నివసించెను
నమ్మి విశ్వసించుము కలుగు నిత్యజీవము – యేసు క్రీస్తే లోకరక్షకుడు

kalam sampoornamainapudu – yesayya bhuvikocchenu
thaane manalanu preminchi rakshakudai janminchenu
rajadhi rajainanu – ilalo daasuniga jeevinchenu
sathyamunu sthaapinchutaku daiva suthuniga udayinchenu

idi asharyame – idi adbhuthame – aha anandame – happy happy christmas

1. gnaanulu saagilapadiri – mrokkiri prabhuvula prabhuvunu
atuvale viswasunchuchu – poojinchedham prabhu yesunu
sarvonnathamaina sthalamulalona – deva devunike mahima
thanakishtulaina prajalandariki – bhoomi meeda samadhaanamu

2. gollalu devuni matanu – grahiyinchiri dhootha cheppaga
vidheyathe manaku mukhyamu – grahiyinchumu devuni chitthamu
vakyamaina devudu sharreradhariga – mana madhyalo nivasinchenu
nammi viswasinchumu kalugu nithya jeevamu – yesu kreesthe loka rakshakudu

ఇంతవరకు చూడని ముందు ఎపుడు జరగని

ఇంతవరకు చూడని ముందు ఎపుడు జరగని
వింత సంగతి యేసు పుట్టుక
బెత్లెహేము అయ్యింది వేదిక
తూర్పునుండి వచ్చింది తారక
అ.ప. : ఎంత గొప్ప కానుక – చింతలింక లేవిక
అంతటా అందుకే పండుగ

1. పాపియైన మనిషిలో నుండి
నీతిరాజు ఎట్లు వచ్చునండి
పావనాత్మ నిండుకొని దైవశక్తి కమ్ముకొని
కన్యమరియ జన్మనిచ్చెనండి

2. అల్పమైన నజరేతునుండి
మంచి ఫలము ఎట్లు వచ్చునండి
చెడ్డదాన్ని ఎన్నుకొని గొప్పచేయ పూనుకొని
మేలుకరముగా మార్చెనండి

3. నరునికై మహిమలో నుండి
మధ్యవర్తి ఎట్లు వచ్చునండి
రక్షకుని వేడుకొని శిక్షమీద వేసుకొని
ఇద్దరిపై చెయ్యి ఉంచెనండి

ఇంటింట సందడి ప్రతి ఇంట సందడి

ఇంటింట సందడి ప్రతి ఇంట సందడి – చేయాలి సందడి ఊరంతా సందడి
మనసంతా సందడి మనకెంతో సందడి – జరగాలి సందడి మన క్రీస్మస్ సందడి
ఆనందమే ఎంతో ఆనందమే యేసు నా కొరకే పుట్టిన రోజా
సంతోషమ్ ఎంతో సంతోషమ్ యేసు నా కొరకే వచ్చే ఈ రోజా “2” “ఇంటి”
లోక పాపము భరియించను దైవ పుత్రుడు దిగివచ్చెను
నీతి సూర్యుడు ఉదయించేను లోకమంతా వెలుగోచ్చెను “2” “ఆనందమే”
దేవదూతలే దిగివచ్చెను దేవదేవుని స్తుతీయించును
గొల్లలంతా వచ్చను యేసురాజును పూజించేను “2” “ఆనందమే”