యేసు ప్రభూ గద్దెపైనున్న నీకు

“ఆ యిరువది నలుగురు పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై యుండువాని యెదుట సాగిలపడి, యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేసిరి.” ప్రకటన Revelation 4:10

యేసు ప్రభూ గద్దెపైనున్న నీకు
మా స్తుతులను చెల్లించెదము
నీ సన్నిధియందు నిన్నారాధించి
పాత్రుండ వీవంచు కీర్తింతుము

పల్లవి : పాత్రుండవీవే పాత్రుండవీవే
పాత్రుండవీవే మాప్రభు నీవే
నీ సన్నిధియందు నిన్నారాధించి
పాత్రుండవీవంచు కీర్తింతుము

1. దేవుడౌ నీవు నరరూపమెత్తి
దూతలకన్న తగ్గింపబడి
స్త్రీ సంతానమౌ నీవు మరణించి
సర్పము తల నణగ ద్రొక్కితివి
|| పాత్రుండవీవే ||

2. నీ సృష్టియే సిల్వయొద్దకు నిన్ను
నడ్పి సిల్వన్ మేకులతో కొట్టిరి
దైవ మానవులచే వీడబడి
శాప నష్ట మనుభవించితివి
|| పాత్రుండవీవే ||

3. మహిమతో మరణమును గెల్చి
గొప్ప విజయము పొందితివి
చావు సమాధులపై విజయుండా
నిన్ను స్తుతింపక నెట్టులుందును
|| పాత్రుండవీవే ||

సర్వముపై యేసు రాజ్యమేలున్

“సమస్తమును ఆయన పాదములక్రింద ఉంచి, సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను.” ఎఫెసీయులకు Ephesians 1:22

సర్వముపై యేసు రాజ్యమేలున్
పాపి మిత్రుడు గొఱ్ఱెపిల్లకు
మన మొరవిన కిరీటము
నిచ్చి హెచ్చించె దేవుడాయనన్

పల్లవి : సర్వముపై సర్వముపై – సిల్వవేయబడినట్టివాడే
పాదములబడి పూజింతుము – సర్వముపై హెచ్చించె దేవుడు

1. తుఫాను భయంకరాలచే
కొట్టునపుడు మొఱ పెట్టగా
యేసును వేడగా నా చేతితో
పట్టి శిలలపై నడ్పించును
|| సర్వముపై ||

2. పట్టణము లతిగొప్పవైనన్
అడ్డములు బలమైనపుడున్
నిర్భయముగ సాగుచుందుము
సర్వముపై నున్న వాని ద్వారా
|| సర్వముపై ||

3. ధృవము నుండి ధృవం వరకు
యుగములనుండి శాశ్వతముగ
సర్వముపై ననుభవింతుము
వీరులై యేసు వెంట సాగుచు
|| సర్వముపై ||

రాజాధి రాజుపై కిరీటముంచుడి

1. రాజాధి రాజుపై కిరీటముంచుడి
పైలోకానంద సునాదంబుల నాలించుడి
లే లెమ్ము డెందమా! నా కై చావొందిన
రారాజుపై కిరీటముంచి రాజున్ జేయుడి

2. ఈ ప్రేమ రాజుపై – కిరీటముంచుడి
ప్రకాశించు ప్రక్కచేతి – గాయంబుల్ చూడుడి
ఏదూత చూచును – భరింప గల్గును
నా వైపు వంగి చూచుచు – న్న – రాజున్ గొల్వుడి

3. ఈ జీవ రాజుపై – కిరీటముంచుడి
చావున్ జయించినన్ – రక్షించిన సజీవియై
చావున్ జయించెను – జీవంబుదెచ్చెను
హా! చావున్ గెల్చి – జీవకి – రీటంబు దెచ్చెను

4. ఈ మోక్షరాజుపై – కిరీటముంచుడి
నిత్యుండై తండ్రితోన్ – శుద్ధాత్మతోడ నైక్యుండు
రవంబు చేయుడి – నిరంతరంబును
ఓ రాజా, నీకే నిత్యఘ – నత ఖ్యాతి గల్గును

భక్తులారా దుఃఖక్రాంతుడు – వచ్చె మహిమతోడ

“వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి; ఆ దినము అతనికి బహు సంతోషకరము.” పరమ గీతము Song Of Songs 3:11

1. భక్తులారా దుఃఖక్రాంతుడు – వచ్చె మహిమతోడ
విజయుడుగాన మోక – రించుటకు పూజ్యుడు
మకుటము తలనుంచి – అభిషిక్తున్ జేయుడు – మకుటము

2. పరలోక మార్భటింప – దూతలారా కొల్వుడి
సింహాసనమునందు రాజు – నభిషక్తున్ చేయుడి
మకుటము తలనుంచి – రాజరికమీయుడి – మకుటము

3. పాపుల్ ముండ్ల మకుట మీయ – గరక్షితు లెల్లరు
చుట్టు నిల్చి స్తుతిపాడి – యేసు పేరుపొందుడి
మకుటము తలనుంచి – జయము ప్రకటించుడి – మకుటము

4. యేసు మహోన్నతు డాయెన్ – హా! మహాసంతోషము
ఆర్భటించు పాట న్విని – గొప్పగా స్తుతించుడి
మకుటము తలనుంచు – డీ రాజాధిరాజుకు – మకుటము

కంటిని గొప్ప ముత్యము – పొందితి హర్షము

“త్వరగా వెళ్ళి తొట్టిలో పడుకొనియున్న శిశువును చూచిరి” లూకా Luke 2:16

1. కంటిని గొప్ప ముత్యము – పొందితి హర్షము
తింటిని జీవాహారము – గ్రోలితి స్నేహము

2. మాత పితృడు యేసుడ – ద్భుత రాజాయనే
గుడ్డలు చుట్టబడెను – మందల కాపరి

3. ఆదియంత రహితుడు – జ్యోతిర్మయ ప్రభు
నార్తులకు నాయకుడు – జాతిగోత్రరహితుడు

4. యూదా గోత్రంపు సింహమా – పితృల దైవమా
నాథా నా హేమ మకుటమా – పాదముల బడితిమి

5. కర్తాదికర్త యేసువా – రాజాధిరాజవు
షారోను రోజా పుష్పమా – మరలవత్తువు

6. మార్గం సత్యం జీవమా – రోషంపు దేవుడా
కున్కని యాజకుండవు – ప్రకాశమయుడా

7. హల్లెలూయాకు పాత్రుడా – ఎల్లరి రక్షకా
రాతి గుండె కరిగింతువు – నీవే సమస్తము