Vinudi sodarulaaraa

Vinudi sodarulaaraa – na Yesu prabhu ilaketenchen

1. Ilaketenchen – mukthini dechchen
papula vidipinchen – vidipinchanesu ilaketenchen “Vinu”

2. Swargeeya thandriki – eka kumaarudu
manushya putrundayan – putrunduga ilaketenchen “Vinu”

3. Gruddiki kannulu – moogaki maatalu
chevitiki chevulanichen – ichutakesu ilaketenchen “Vinu”

4. Kustu rogula – shuddula jesenu
chachina vaarini lepen – leputakesu ilaketenchen “Vinu”

5. Paapamulo neevu – padiyundagaa
pavitra premanu jupen – jupenchanesu ilkaetenchen “Vinu”

6. Paapula korakai – siluvanu mosen
raktamunu chindhinchen-chindincha nesu ilaketenchen “Vinu”

7. Yesu naamamuna – viswaasa munchumu
nischayamuga rakshinchun – rakshinchanesu ilaketenchen “Vinu”

8. Mahima ghanatha – mayesu prabhunake
mammula thandritho jerchen jerchutakesu ilaketenchen “Vinu”

“పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను.” 1 తిమోతి Timothy 1:15

పల్లవి : వినుడి సోదరులారా – నా యేసు ప్రభు – యిల కేతెంచెన్

1. ఇలకేతెంచెన్ – ముక్తిని దెచ్చెన్
పాపుల విడిపించెన్ – విడిపించ నేసు యిలకేతెంచెన్
|| వినుడి ||

2. స్వర్గీయ తండ్రికి – ఏక కుమారుడు
మనుష్య పుత్రుండాయెన్ – పుత్రుండుగా యిలకేతెంచెన్
|| వినుడి ||

3. గ్రుడ్డికి కన్నులు – మూగకి మాటలు
చెవిటికి చెవుల నిచ్చెన్ – యిచ్చుటకేసు యిలకేతెంచెన్
|| వినుడి ||

4. కుష్ఠ రోగుల – శుద్ధులజేసెను
చచ్చినవారిని లేపెన్ – లేపుటకేసు యిలకేతెంచెన్
|| వినుడి ||

5. పాపములో నీవు – పడియుండగా
పవిత్ర ప్రేమను జూపెన్ – జూపించనేసు యిలకేతెంచెన్
|| వినుడి ||

6. పాపుల కొఱకై – సిలువను మోసెన్
రక్తము చిందించెన్ – చిందించ నేసు యిలకేతెంచెన్
|| వినుడి ||

7. యేసు నామమున – విశ్వాసముంచుము
నిశ్చయముగ రక్షించున్ – రక్షించనేసు యిలకేతెంచెన్
|| వినుడి ||

8. మహిమ ఘనత – మాయేసు ప్రభునకే
మమ్ముల తండ్రితో జేర్చెన్ – జేర్చుటకేసు యిలకేతెంచెన్
|| వినుడి ||

Leave a Comment