Yehovaa goppa kaaryamulu chesenu
veeri koraku – ihamuna – annya janamulella
cheppukonu chunnaaratula
1. Yehovaa mana koraku goppa kaaryamulu
chesenu mahaa santosha bharithula maitimi
sahapani vaarinigaa jesen “Yehovaa”
2. Praarambha kaala panulanu – parihashinchu –
vaarevaru prabhu pani cheya padivelagu nokadu
viraviga balamou jana magunu “Yehovaa”
3. Prabhu suvaarthakai bahugaa memu baadimpa –
badi yuntimi – prabhalenu prabhuni vaakyamu
prabalitimi memu prabhukrupalo “Yehovaa”
4. Porapaatu lenno chesitimi – prabhu krupatho
mammu kshaminchen – virodhi mantra shakunamu
lemi – ishraayelulo nika levu “Yehovaa”
5. Bhoomipai gaddini thadupu vaana vale vijayamu
nitchenu – sama bhoomini boli samudramulo
kshemamu gaa mamu nadipenu “Yehovaa”
6. Adhikambaaye maa anthya dasha modati panulanu
minchen – modati mandira mahimanu minche –
thudi mandirapu mahima “Yehovaa”
7. Mahima ghanathaa prabhaavamulu – maa
kruthajnathaa stotramulu simhaasanaaseenunda
maadu – siyonu raajaa Halleluyaa “Yehovaa”
యెహోవా గొప్ప కార్యములు చేసెను వీరికొరకు
ఇహమున అన్యజనము లెల్ల చెప్పుకొనుచున్నారటుల
1. యెహోవా మనకొరకు – గొప్ప కార్యములు చేసెను
మహా సంతోషభరితులమైతివిు – సహపనివారినిగా జేసెన్
|| యెహోవా ||
2. ప్రారంభ కాలపనులను – పరిహసించువారెవరు
ప్రభు పనిచేయ పదివేలగు నొకడు – విరవిగ బలమౌ జనమగును
|| యెహోవా ||
3. ప్రభు సువార్తకై బహుగా మేము – బాధించబడి యుంటిమి
ప్రబలెను ప్రభుని వాక్యము – ప్రబలితిమి మేము ప్రభు కృపలో
|| యెహోవా ||
4. పొరపాటులెన్నో చేసితిమి – ప్రభుకృపతో మమ్ము క్షమించెన్
విరోధి మంత్ర శకునము లేమి – ఇశ్రాయేలులో నికలేవు
|| యెహోవా ||
5. భూమిపై గడ్డిని తడుపు – వానవలె విజయము నిచ్చెను
సమ భూమిని బోలి సముద్రములో – క్షేమముగా మము నడిపెను
|| యెహోవా ||
6. అధికంబాయె మా అంత్యదశ – మొదటి పనులను మించెన్
మొదటి మందిర మహిమను మించె – తుది మందిరపు మహిమ
|| యెహోవా ||
7. మహిమ ఘనతా ప్రభావములు – మా కృతజ్ఞతా స్తోత్రములు
సింహాసనాసీనుండా మాదు – సీయోను రాజా హల్లెలూయా
|| యెహోవా ||