Parishuddu lellaru yesun pogadi – paadi
yaarbaatinchi paramuna nunda paramaananda
geeta machata dwanimpa neevachata
nunduvaa ? (3 times) naa manasamaa !
2. Gorre pillayu raajya meluchunda – naa shritu
lellaru naayananu chera mitru della
kanneeti duduchu chunda nee vachata
nunduvaa ? naa maanasamaa !
3. Peturu Poulu Yohaanu nachata – pitaamahulu
yapostululandaru hatha saakshu lellaru
samaaveshimpa nee vachata
nunduvaa ? naa manasamaa !
4. Jagamulo siluvanu mosinacho –
kireetamu dhariyinchi bhasilluduru deva
putrulugaa nellaru maaragaa – nee
vachata nundu vaa ? naa manasamaa !
5. Shodhanala jayinchina veerulella –
kasta shrama lorchina mahaatmulu
jyotirmayulugaa noppaaru chunda –
nee vachata nunduvaa ? naa manasamaa !
6. Kanya karani naadu prabhu sanghamu –
raaju Yesu pendli kumaaruniki bharyagaa
prakaashimpa daani ruchimpa nee vachata
nunduvaa ? naa maanasamaa ne nachata
nundedanu naa yesu thoda
పరిశుద్ధులెల్లరు యేసున్ పొగడి – పాడి యార్భటించి పరముననుండ
పరమానంద గీతమచ్చట ధ్వనింప – నీ వచట నుందువా? (3) నా మానసమా!
2. గొఱ్ఱెపిల్లయు రాజ్యమేలుచుండ – నాశ్రితు లెల్లరు నాయనను చేర
మిత్రుడెల్ల కన్నీటి దుడుచుచుండ – నీ వచట నుందువా? నా మానసమా!
3. పేతురు పౌలు యోహాను నచట – పితామహులు యపోస్తలులందరు
హతసాక్షులెల్లరు సమావేశింప – నీ వచట నుందువా? నా మానసమా!
4. జగములో సిలువను మోసినచో – కిరీటము ధరియించి భాసిల్లుదురు
దేవ పుత్రులుగా నెల్లరు మారగా – నీ వచట నుందువా? నా మానసమా!
5. శోధనల జయించిన వీరులెల్ల – కష్టశ్రమలోర్చిన మహాత్ములు
జ్యోతిర్మయులుగా నొప్పారుచుండ – నీ వచట నుందువా? నా మానసమా!
6. కన్యకరణినాడు ప్రభుసంఘము – రాజు యేసు పెండ్లి కుమారునికి
భార్యగా ప్రకాశింప దాని రుచింప – నీ వచట నుందువా? నా మానసమా!
నేనచట నుండెదను నా యేసుతోడ