Yesu sheegramugaa vachchun
aashatho kanipettudi
1. Guruthulella lokamanthaa – sarigajooda
kaananagun parishuddhamaina
pravarthanatho prabhukai kanipettudi
2. Proddu grunki vachchunemo – ardharaatri
yandemo udayampu kodi koothalappudu –
vachchunemo kanipettudi
3. Siddapadudi meerilalo – meeru devuni
sandhimpa siddapadudi theerpunakai –
prabhukai kanipettudi
4. Parishuddhulai jeevinchudi – prabhuni chittamu
cheyudi maranamesu nande summaa –
melukoni kanipettudi
5. Yesu vale jeevinchudi – theesiveyudi
malinamulan – mosamputaashala nanni vidichi –
aashatho kanipettudi
6. Veshadhaarana vidachi – yesu mudhrala
dharinchi pendli kumaaruni sandhimpa –
andaru kani pettudi
7. Meghamulapai vellina prabhu – vegamuga
vachchunila sakala shramalanu bharinchi –
Halleluya paadudi
యేసు శీఘ్రముగా వచ్చున్ ఆశతో కనిపెట్టుడి
1. గురుతులెల్ల లోకమంతా – సరిగజూడ కాననగున్
పరిశుద్ధమైన ప్రవర్తనతో – ప్రభుకై కనిపెట్టుడి
|| యేసు||
2. ప్రొద్దు గ్రుంకి వచ్చునేమో – అర్ధరాత్రి యందేమో
ఉదయంపు కోడికూతలప్పుడు – వచ్చునేమో కనిపెట్టుడి
|| యేసు ||
3. సిద్ధపడుడి మీరిలలో – మీరు దేవుని సంధింప
సిద్ధపడుడి తీర్పునకై – ప్రభువుకై కనిపెట్టుడి
|| యేసు ||
4. పరిశుద్ధులై జీవించుడి – ప్రభుని చిత్తము చేయుడి
మరణమేసు నందె సుమ్మా – మేలుకొని కనిపెట్టుడి
|| యేసు ||
5. యేసువలె జీవించుడి – తీసి వేయుడి మలినములన్
మోసంపుటాశల నన్ని విడచి – ఆశతో కనిపెట్టుడి
|| యేసు ||
6. వేషధారణ విడచి – యేసు ముద్రల ధరించి
పెండ్లి కుమారుని సంధింప – అందరు కనిపెట్టుడి
|| యేసు ||
7. మేఘములపై వెళ్ళిన ప్రభు – వేగముగ వచ్చునిల
సకల శ్రమలను భరించి – హల్లెలూయ పాడుడి
|| యేసు ||