Adigo calvarilo yesu rakshakude

Adigo calvarilo – yesu rakshakude
deenudai vrelaaduchunnade

1. Mahima ghanathanu marachi vadilene – katina
siluvane – korukonnaade – maaya jagaththulo naashana
mondaka – kougalinchenu – calvarilo preman

2. Suroopamaina – sogasainaledu – nannu rakshimpa –
vikaarundaayen – palu nindalan – bharinchenu –
padivelalo – nathikaankshaneeyude

3. Mundla makutam – shobhitha vastrame – paada
hastamulalo – cheelalu kalavu – rakhta daagulatho
vrelaadenu – marana daasula – vimochinchen

4. Yesuni thyaagam naa yaashrayame – goppa santosham
priyuni raajyam – paada jaadalalo nadachutaye –
naa jeevithamandali – yaanandam

5. Siluva drushyamunu – choochi ne ujjeevamutho – seva
cheyudune – nireekshanatho – jeevinchedane – nannu
cherchukonu – yesu raajyamulo

అదిగో కల్వరిలో యేసు రక్షకుడే
దీనుడై వ్రేలాడుచున్నాడే
1. మహిమ ఘనతను మరచి వదిలెనే
కఠిన సిలువనే కోరుకొన్నాడే
మాయ జగత్తులో నాశన మొందక
కౌగలించెను కల్వరిలో ప్రేమన్
|| అదిగో ||

2. సురూపమైన సొగసైన లేదు
నన్ను రక్షించ వికారుండాయెన్
పలునిందలన్ భరించెను
పదివేలలో నతి కాంక్షణీయుడే
|| అదిగో ||

3. ముండ్ల మకుటం శోభిత వస్త్రమే
పాద హస్తములలో చీలలు కలవు
రక్త డాగులతో వ్రేలాడెను
మరణ దాసుల విమోచించెన్
|| అదిగో ||

4. యేసుని త్యాగం నా యాశ్రయమే
గొప్పసంతోషం ప్రియుని రాజ్యం
పాద జాడలలో నడచుటయే
నా జీవితమందలి యానందం
|| అదిగో ||

5. సిలువ దృశ్యమును చూచి నే
ఉజ్జీవముతో సేవ చేయుదునే
నిరీక్షణతో జీవించెదనే
నన్ను చేర్చుకొను యేసు రాజ్యములో
|| అదిగో ||

Leave a Comment