Daivatanayaa kristhunadhundaa – Ayyaa
papulakai pranamichitivaa – devude ninu pampinadaa
1. Papulakai vachchinaavaa papulanu karuninchinavaa
praanadanamu chesinavaa – devaa paralokamu terachinavaa
“Deva”
2. Calvarilo karchinatti divya rakhtamuche mammu
kadigi paavana parachinavaa devaa
kadaku boorato raanai yunnavaa “Deva”
3. Maranamu jayinchinava – marana mullu virachinavaa
mahimatoda lechinavaa – devaa
maadu chintalu deerchinavaa “Deva”
4. Dharanilo athi dushtulamuga daariteliyaka
dooramaitimi dharanike yethenchinavaa – devaa
dhanyulanuga jesinavaa “Deva”
5. Aadi yantamu lenivada andarikini devudavu
alphayu omegayu neevega – yesu
arbhatinchuchu raanai yunnavaa “Deva”
దైవతనయా క్రీస్తునాథుండా అయ్యా
పాపులకై ప్రాణమిచ్చితివా
దేవుడే నిను పంపినాడా
1. పాపులకై వచ్చినావా పాపులను కరుణించినావా
ప్రాణదానము చేసినావా – దేవా
పరలోకము తెరచినావా
|| దైవతనయా ||
2. కల్వరిలో కార్చినట్టి దివ్యరక్తముచే మమ్ము
కడిగి పావన పరచినావా – దేవా
కడకు బూరతో రానై యున్నావా
|| దైవతనయా ||
3. మరణము జయించినావా మరణముల్లు విరచినావా
మహిమతోడ లేచినావా – దేవా
మాదు చింతలు దీర్చినావా
|| దైవతనయా ||
4. ధరణిలో అతి దుష్టులముగా దారి తెలియక దూరమైతిమి
ధరణికే ఏతెంచినావా – దేవా
ధన్యులనుగా జేసినావా
|| దైవతనయా ||
5. ఆదియంతము లేనివాడా అందరికిని దేవుడవు
అల్ఫయు ఓమేగయు నీవేగా – యేసు
ఆర్భటించుచు రానై యున్నావా
|| దైవతనయా ||