Deva sutudu yesu janminche

Deva sutudu yesu janminche – niratamu stutiyintumu

1. Papula rakshincha parama nadhudu –
shramalanu pondenu Aa….
nashiyinchina varin vedaki rakshimpa –
rakshakudai puttenu “Deva”

2. Bethlehemulo nuththamudu janminchenu –
thandri chittamu chesenu Aa….
bhaktulu padamulaku mrokkiri
manamu sthutiyinthumu “Deva”

3. Ghanudu puttenu pashula pakalo –
gollalu poojinchiri Aa….
vere jenulu choteeyakunnanu –
manamu sthutiyinchedamu “Deva”

4. Puttina rathri prakashamanam –
mrutin pagatilo Aa….
sthutulaku tagina shuddhudu dutala –
sthutulanu bondenu “Deva”

5. Narulu bonkinanu vedamu bonkadu –
narula hrudayamemo Aa
punyuni janmamu mee madinunna –
poojinturu vani “Deva”

6. Anaadi devuni chittamuche –
sree – yesu bayalupadenu Aa..
jalanidhi valene ayana jnaanamu –
manalanu nimpunu “Deva”

7. Aanandamuga Yehovaku –
halleluya padedamu Aa…
halleluya amen amen halleluya halleluya amen “Deva”

దేవసుతుడు యేసు జన్మించె – నిరతము స్తుతియింతుము

1. పాపుల రక్షించ పరమ నాథుడు – శ్రమలను పొందెను ఆ …
నశియించిన వారిన్ వెదకి రక్షింప – రక్షకుడై పుట్టెను
|| దేవసుతుడు ||

2. బెత్లెహేములో నుత్తముడు జన్మించెను – తండ్రి చిత్తము చేసెను ఆ …
భక్తులు పాదములకు మ్రొక్కిరి – మనము స్తుతియింతుము
|| దేవసుతుడు ||

3. ఘనుడు పుట్టెను పశుల పాకలో – గొల్లలు పూజించిరి ఆ …
వేరే జనులు చోటీయకున్నను – మనము స్తుతియించెదము
|| దేవసుతుడు ||

4. పుట్టినరాత్రి ప్రకాశమానం – మృతిన్ పగటిలో ఆ …
స్తుతులకు తగిన శుద్ధుడు దూతల – స్తుతులను బొందెను
|| దేవసుతుడు ||

5. నరులు బొంకినను వేదము బొంకదు – నరుల హృదయమేమో ఆ …
పుణ్యుని జన్మము మీ మదినున్న – పూజింతురు వాని
|| దేవసుతుడు ||

6. అనాది దేవుని చిత్తముచే – శ్రీ – యేసు బయలుపడెను ఆ …
జలనిధి వలెనే ఆయన జ్ఞానము – మనలను నింపును
|| దేవసుతుడు ||

7. ఆనందముగా యెహోవాకు – హల్లెలూయ పాడెదము ఆ …
హల్లెలూయ ఆమేన్ ఆమేన్ హల్లెలూయ – హల్లెలూయ ఆమేన్
|| దేవసుతుడు ||

Leave a Comment