జాన్ లోగీ బయర్డ్ (John Logie Baird) – టెలివిజన్ కనుగొన్నవాడు | బైబిల్ వాక్యాధారంతో పుట్టిన ఆవిష్కరణ
పూర్తి పేరు: జాన్ లోగీ బయర్డ్
తల్లిదండ్రులు: జాన్ బయర్డ్ & జెస్సీ మోరిసన్ ఇంగ్లిస్
జన్మస్థలం: హెలెన్స్ బర్గ్, స్కాట్లాండ్
జననం: 13 ఆగస్టు 1888
మరణం: 14 జూన్ 1946
వ్యక్తిగత సాక్ష్యం (Personal Testimony):
టెలివిజన్ను కనుగొన్న జాన్ లోగీ బయర్డ్ ఒక భక్తుడైన కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి ఒక పాస్టర్ – దేవుని సేవలో నిత్యం నిమగ్నుడై ఉండేవారు. కానీ చిన్ననాటి నుండే బయర్డ్లో ఒక కొత్త ఆలోచన ఉండేది — “ప్రపంచానికి ఉపయోగపడే ఏదైనా కొత్తది కనిపెట్టాలి!” అని.
తన తండ్రి దేవుని పనికి దూరం అవుతాడేమోనని ఆందోళనతో అతని ఆవిష్కరణ ఆసక్తికి పెద్దగా ప్రోత్సాహం ఇవ్వలేదు. అయినప్పటికీ బయర్డ్ యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చదువుకొని, దేవుని సేవతో పాటు తన శాస్త్రీయ జ్ఞానం ద్వారా మానవాళికి ఉపయోగపడే పనిని చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఒక రోజు తన అక్క ఆన్నీతో మాట్లాడుతూ, “నాకు దేవుడు ఒక మంచి ఆలోచన ఇవ్వాలి – ఇది ప్రపంచ ప్రజలకు ప్రయోజనం కలిగించాలి,” అని అన్నాడు.
అప్పుడు అతని అక్క ఇలా ప్రశ్నించింది:
“గతవారం నాన్న గారు బోధించినప్పుడు ప్రకటన గ్రంథములో చెప్పిన వాక్యం గుర్తుందా? ‘అంత్యదినములలో ఇద్దరు ప్రవక్తలను క్రూరమృగము చంపుతుంది. వారి శవములను ప్రపంచమంతా చూడును’ (ప్రకటన గ్రంథము 11:9-10). ఇది ఎలా సాధ్యం? యెరూషలేములో వారి శవములు ఉంటే ప్రపంచమంతా ఎలా చూస్తుంది?” అని అడిగింది.
ఆ ప్రశ్న జాన్ లోగీ బయర్డ్ మనసును కదిలించింది. ఆయన బైబిల్ చదువుతూ ఆ వాక్యంపై ఆలోచించాడు. అప్పట్లో రేడియో లేదు, టెలివిజన్ లేదు, విద్యుత్ కూడా అంతగా లేని కాలం. అయితే దేవుడు తన వాక్యంలో “ప్రపంచమంతా చూచును” అని రాయించాడు.
అప్పుడే బయర్డ్ గ్రహించాడు —
“ప్రపంచ ప్రజలు ఒక చోట జరుగుతున్న సంఘటనను చూడగలగాలంటే అది టెలివిజన్ ద్వారానే సాధ్యం!”
దేవుని వాక్యముపై విశ్వాసంతో బయర్డ్ టెలివిజన్ ఆవిష్కరణకు ప్రయత్నం ప్రారంభించాడు. ఎన్నో సార్లు విఫలమైనా, విశ్వాసం కోల్పోలేదు. చివరకు 1928లో, జాన్ లోగీ బయర్డ్ విజయవంతంగా టెలివిజన్ను కనిపెట్టాడు.
బైబిల్ ఆధారం (Biblical Inspiration):
“మరియు జనములు, వంశములు, భాషలు మాటలాడువారు, భూమిపై నివసించువారు మూడు దినములన్నర వారి శవములను చూచుదురు…”
(ప్రకటన గ్రంథము 11:9)
ఈ వాక్యమే బయర్డ్ ఆవిష్కరణకు ప్రేరణ. బైబిల్ రాయించిన దేవుడు సర్వజ్ఞుడు, భవిష్యత్తు తెలిసినవాడు. ఆయన యోహానుతో టెలివిజన్ సాంకేతికత ఏర్పడకముందే ఈ వాక్యాన్ని రాయించాడు.
నేటి టెలివిజన్ ద్వారా ప్రపంచ వార్తలు, సంఘటనలు మన కంటికి కనబడుతున్నాయి అంటే — అది దేవుని వాక్యం సత్యమని, బైబిల్ దైవగ్రంథమని నిరూపణ!
జాన్ లోగీ బయర్డ్ తన జీవితమంతా దేవుని మీద విశ్వాసంతో శ్రమించి, మానవాళికి వెలుగు చూపే టెక్నాలజీని అందించాడు.
చివరగా 1946 జూన్ 14 న ఆయన ప్రభువునందు విశ్రాంతి పొందాడు.