Meluko mahimaraju

Meluko ! mahimaraju vegame ranai yunnadu

1. Paramunundi – boora dwanito arayu nesu – arbhatamuto
sarvalokamu – terichuchunu twarapadu O priyundaa “Me”

2. Gurutulella – dharaniyandu sariga chuda – jaruguchunda
chirunavvuto – chera prabhuni twarapadu O priyundaa “Me”

3. Kristunandu – mrutalellaru kadaboora – mrogagane kresthu
vale – tirigi leturu – letuva ? neevu priyudaa “Me”

4. Arayanga – parisuddulu murisedaru – akashaya dehulai
paramandu – prabhu kristu niratamu – O priyundaa “Me”

5. Karunaleni – O maranama nirathamu neeku jayamaguna
marana samha – rundesu twaraga – raanai yunnaadu “Me”

6. Maamsaloka – pishaachaadulu – himsaparacha – vijrumbinchina
leshamainanu – jadiyakumu aashatho – kaachukonumu “Me”

7. Papamunu cheyakuma repakuma – daiva kopamunu
shaapamunu – thappukoni shraddatho – kaachukonumaa “Me”

మేలుకో! మహిమ రాజు వేగమే రానై యున్నాడు

1. పరమునుండి – బూర ధ్వనితో అరయు నేసు – ఆర్భాటముతో
సర్వలోకము – తేరిచూచును త్వరపడు ఓ ప్రియుండా
|| మేలుకో ||

2. గురుతులెల్ల – ధరణియందు సరిగ చూడ – జరుగుచుండ
చిరునవ్వుతో – చేరి ప్రభుని త్వరపడు ఓ ప్రియుండా
|| మేలుకో ||

3. క్రీస్తునందు – మృతులెల్లరు కడబూర – మ్రోగగానే
క్రీస్తువలె – తిరిగి లేతురు – లేతువా? నీవు ప్రియుడా
|| మేలుకో ||

4. అరయంగ – పరిశుద్ధులు మురిసెదరు – అక్షయ దేహులై
పరమందు – ప్రభుక్రీస్తు నిరతము – ఓ ప్రియుండా
|| మేలుకో ||

5. కరుణలేని – ఓ మరణమా నిరతము నీకు జయమగునా
మరణ సంహా – రుండేసు త్వరగా – రానై యున్నాడు
|| మేలుకో ||

6. మాంసలోక – పిశాచాదులు హింస పరచ – విజృంభించిన
లేశమైనను – జడియకుము ఆశతో – కాచుకొనుము
|| మేలుకో ||

7. పాపమును – చేయకుమా రేపకుమా – దైవ కోపమును
శాపమును – తప్పుకొని శ్రద్ధతో – కాచుకొనుమా
|| మేలుకో ||

Leave a Comment