Naa korakai anniyu chesenu yesu

Naa korakai anniyu chesenu yesu
naa kinka bhayamu ledu lokamulo

A. P. : Naa korakai anniyu chesinandulaku nenu
rakshana paatranu yeththi aaraadinchedan

1. Kshaamamandu Eliyaaku appamitchenu – kshaamam
theerchi Eliyaanu aasheervadinchen kshaamam
theerevaraku aa vidhavaraali inta noone kaina
pindi kaina koratha ledu “Naa korakai”

2. Aakaasha pakshulanu gamaninchudi – viththavu avi
pantanu koyavu – vaatini poshinchu natti
parama pithaa – mammu anudina
madputhambugaa nadupun “Naa korakai”

3. Emi dharintumani chintapadaku – adavi pushpa
mulanu theri choodumu – adavi puvvula
prabhu alankarimpa –
thaane nishchyambugaa
mammu alankarinchunu “Naa korakai”

4. Repati dinamu goorchi chinta padaku
aaptudesu naakunda bhaya menduku repu daani
sangatula nade chintinchun enati keedu
aanaatike ila chaalunu “Naa korakai”

5. Aasheervadinchedi yesu aranyamulo poshinchenu
aiduvela mandini kooda theerchunu prabhuve
prati avasarathan – yesu thannu thaane
arpinchenu naa korakai “Naa korakai”

నాకొరకై అన్నియు చేసెను యేసు
నాకింక భయము లేదు లోకములో

అనుపల్లవి : నాకొరకై అన్నియు చేసినందులకు
నేను రక్షణ పాత్రను యెత్తి ఆరాధించెదన్

1. క్షామమందు ఏలీయాకు అప్పమిచ్చెను
క్షామంతీర్చి ఏలీయను ఆశీర్వదించెన్
క్షామం తీరే వరకు ఆ విధవరాలి
ఇంట నూనెకైన పిండికైన కొరత లేదు
|| నాకొరకై ||

2. ఆకాశపక్షులను గమనించుడి
విత్తవు అవి పంటను కోయవు
వాటిని పోషించునట్టి పరమపితా – మమ్ము
అనుదిన మద్భుతంబుగా నడుపున్
|| నాకొరకై ||

3. ఏమి ధరింతుమని చింతపడకు
అడవి పుష్పములను తేరిచూడుము
అడవి పువ్వుల ప్రభు అలంకరింప – తానే
నిశ్చయంబుగా మమ్ము అలంకరించును
|| నాకొరకై ||

4. రేపటి దినము గూర్చి చింతపడకు
ఆప్తుడేసు నాకుండ భయమెందుకు
రేపుదాని సంగతులనదే చింతించున్ – ఏ
నాటికీడు ఆనాటికే ఇలచాలును
|| నాకొరకై ||

5. ఆశీర్వదించెడి యేసు అరణ్యములో
పోషించెను ఐదువేలమందిని కూడ
తీర్చును ప్రభువే ప్రతి అవసరతన్ – యేసు
తన్ను తానే అర్పించెను నా కొరకై
|| నాకొరకై ||

Leave a Comment