Rakshanya paatalu paadi

Rakshanya paatalu paadi – rakshakudesuni
sadaa koniyaadu

A. P. : Ikkattulona yesunu vediki – ekkaala mandunu
stutincha koodi

1. Andhakaaramu nundi vidipinchi amarthyudesuni
raajyamu cheri anniyu nosagu devuni jeri –
pennuga prabhuni mahimaparachi “Rakshanya”

2. Agni nundi theesi koravini – vighnamu leka
baita vesi kapata veshamu paaradrolina –
praapaku desagu vekuva chukkanu “Rakshanya”

3. Bhayankara paapa koopamunundi – buradalo
nundi paikilaagi kaallanu bandameeda
nilipi – paadamulanu stira parachina yatti “Rakshanya”

4. Maranamu nundi thappinchinattiyu thathkaalamuna
thappinchu chunna ika mundunu thappinchunanu
goppa nammakamu manakitchina “Rakshanya”

5. Sankatamula nundi vidipinchi – vanakunu mana
kedabaatu chesina – kastahpettina baadhala
tholaginchi – vidipinchinatti yesuni choochi “Rakshanya”

6. Shramala nellanu paaradroli
shodhanalu manalanu jerakanu sukhamula maakellappudu
nitchina prema swaroopini stotrinchuchunu “Rakshanya”

7. Dustalokamu nundi manalanu – lokaadhipathi
saitaanu nundi pishaachi yadhikaaramulonundi
vidipinchina prabhunaku Halleluya “Rakshanya”

రక్షణ్య పాటలు పాడి
రక్షకుడేసును సదా కొనియాడు

అనుపల్లవి : ఇక్కట్టులోన యేసును వెదకి
ఎక్కాల మందును స్తుతించ కూడి

1. అంధకారము నుండి విడిపించి
అమర్త్యుడేసుని రాజ్యము జేరి
అన్నియు నొసగు దేవుని జేరి
పెన్నుగ ప్రభును మహిమపరచి
|| రక్షణ్య ||

2. అగ్ని నుండి తీసి కొరవిని
విఘ్నము లేక బైట వేసి
కపట వేషము పారద్రోలిన
ప్రాపకు డేసగు వేకువ చుక్కను
|| రక్షణ్య ||

3. భయంకర పాపకూపము నుండి
బురదలో నుండి పైకిలాగి
కాళ్ళను బండమీద నిలిపి
పాదములను స్థిరపరచిన యట్టి
|| రక్షణ్య ||

4. మరణము నుండి తప్పించినట్టియు
తత్కాలమున తప్పించుచున్న
ఇక ముందును తప్పించునను
గొప్ప నమ్మకమును మనకిచ్చిన
|| రక్షణ్య ||

5. సంకటములనుండి విడిపించి
వణకును మనకెడబాటు చేసిన
కష్టపెట్టిన బాధల తొలగించి
విడిపించినట్టి యేసును చూచి
|| రక్షణ్య ||

6. శ్రమల నెల్లను పారద్రోలి
శోధనలు మనలను జేరకను
సుఖముల మా కెల్లప్పుడు నిచ్చిన
ప్రేమ స్వరూపిని స్తోత్రించుచును
|| రక్షణ్య ||

7. దుష్టలోకము నుండి మనలను
లోకాధిపతి సైతాను నుండి
పిసాచి యధికారములో నుండి
విడిపించిన ప్రభునకు హల్లెలూయ
|| రక్షణ్య ||

Leave a Comment