Siluvalo baliyaina devuni
gorrepilla viluvaina nee preman
vivarinthu sree Yesu
1. Aanaati yoodule ninnu jampi ranukonti
kaadu kaadaiyaiyyo
na paapa runamunake “Siluvalo”
2. Naa yatikrama mulakai – naluga
gottabadi – naa doshamula neevu
priyamuganu mositivaa “Siluvalo”
3. Mruduvaina nee nuduru – mundla
potla cheta – suroopamu leka
solipotivaa priyudaa “Siluvalo”
4. Naa rogamula nee pai Namrathatho
bhariyinchi – thruneekarimpa badi
praana marpinchitivi “Siluvalo”
5. Vyasanaa kraanthudavu gaa – vyaadhi
nanubhavinchi mounamu dhariyinchi
marana maithivaa prabhuvaa “Siluvalo”
6. Naa paapa doshamuche – ne chachchi
yundagane maranamai naa koraku
mari thirigi lechitivaa “Siluvalo”
7. Paramuna keththa badina – priya yesu
raakadakai padilamugaa kanipetti
paadedanu Halleluya “Siluvalo”
సిలువలో బలియైన దేవుని గొఱ్ఱెపిల్ల
విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసు
1. ఆనాటి యూదులే నిన్ను జంపిరనుకొంటి
కాదు కాదయ్యయ్యో – నా పాప ఋణమునకే
|| సిలువలో ||
2. నా యతిక్రమములకై – నలుగగొట్టబడి
నా దోషముల నీవు – ప్రియముగను మోసితివా
|| సిలువలో ||
3. మృదువైన నీ నుదురు – ముండ్ల పోట్లచేత
సురూపము లేక – సోలిపోతివా ప్రియుడా
|| సిలువలో ||
4. నా రోగముల నీపై నమ్రతతో భరియించి
తృణీకరింపబడి – ప్రాణమర్పించితివి
|| సిలువలో ||
5. వ్యసనాక్రాంతుడవుగా – వ్యాధి ననుభవించి
మౌనము ధరియించి – మరణమైతివా ప్రభువా
|| సిలువలో ||
6. నా పాప దోషముచే – నే చచ్చి యుండగనే
మరణమై నాకొరకు – మరి తిరిగి లేచితివా
|| సిలువలో ||
7. పరమున కెత్తబడిన – ప్రియ యేసురాకడకై
పదిలముగ కనిపెట్టి – పాడెదను హల్లెలూయ
|| సిలువలో ||